అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలుకెళ్లడం ఎంతో బాధ: జగన్, కేసులు నన్నేం చేయవ్: చంద్రబాబు

జైలుకు వెళ్లడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జైలుకు వెళ్లడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

నిర్ధారణ లేకుండా 16 నెలలు తనను జైలులో ఉంచారని జగన్ విమర్శించారు. కేసుపై విచారణ పేరుతో మూడు నెలల కంటే ఎక్కువ జైలులో పెట్టడానికి లేదని చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై తనను జైలుకు పంపించారని ఆరోపించారు.

<strong>ఓటుకు నోటు: 'ఓ సీఎంకు సుప్రీం నోటీసులు పెద్ద విషయమే'</strong>ఓటుకు నోటు: 'ఓ సీఎంకు సుప్రీం నోటీసులు పెద్ద విషయమే'

కేసులు నన్నేం చేయలేవు: చంద్రబాబు

తనపై వేస్తున్న కేసుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వాటి గురించి తాను పట్టించుకోనని చెప్పారు. ఎలాంటి తప్పు చేయనందున తాను భయపడేది లేదన్నారు.

YS Jagan talks about jail life and Chandrababu on cases

గతంలో తనపై 26 కేసులు వేసినా ఏమీ చేయలేరని చెప్పారు. ఇంకా తనకు వ్యతిరేకంగా కేసులు వేస్తూనే ఉన్నారని, ఎన్ని కేసులు వేసినా భయపడేది లేదన్నారు. కొన్ని కేసులు తనపై వేస్తే 2012లో తేలిందన్నారు. తనపై కేసులు వేస్తే ఏమయిందని, ఏమీ కాలేదన్నారు.

<strong>ఇదే మా బతుకు, ఇదీ నీ కథ: జేసీ వర్సెస్ జగన్... అక్కడే స్టార్ట్!</strong>ఇదే మా బతుకు, ఇదీ నీ కథ: జేసీ వర్సెస్ జగన్... అక్కడే స్టార్ట్!

కాగా, ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ప్రాసిక్యూషన్‌ చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్‌ చేయాలా.. వద్దా అన్న అంశంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని జస్టిస్‌ బూబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ పిటిషన్‌ను వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా దానిని సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy talk about jail life. AP CM Chandrababu Naidu talk about cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X