వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అన్న వస్తున్నాడు.. నవ రత్నాలు తెస్తున్నాడు’: జగన్ ట్వీట్ హాట్‌టాపిక్

ఇటీవల జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం తన ట్వీట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం తన ట్వీట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన హాట్ టాపిక్‌గా మారింది. 'మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు 'అన్న వస్తున్నాడు - నవరత్నాలు తెస్తున్నాడు'' అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

వీడియోను ట్వీట్ చేసి..

ప్లీనరీలో మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాము అధికారంలోకి రాగానే తొమ్మిది పథకాలను అమలుచేయనున్నట్టు వైయస్‌ జగన్‌ ప్లీనరీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

నవ రత్నాలివే..

నవ రత్నాలివే..

రైతులకు 'వైయస్‌ఆర్‌ భరోసా', డ్వాక్రా మహిళలకు 'వైయస్సార్‌ ఆసరా', వృద్ధులకు రూ. 2వేల పెన్షన్‌, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువుల కోసం అమ్మ ఒడి పథకం, ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం.. ఇలా తొమ్మిది పథకాలతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతోషాలు నింపుతామని జగన్ భరోసా ఇచ్చారు.

Recommended Video

Chandrababu Naidu Survey Report on Ministers
అన్న వస్తున్నాడు..

అన్న వస్తున్నాడు..

‘అన్న వస్తున్నాడు.. నవరత్నాలు తెస్తున్నాడు' అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరాలే ఉండటంతో జగన్ అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

సిద్ధం చేస్తున్నారా?

సిద్ధం చేస్తున్నారా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తాజా ట్వీట్ ద్వారా పార్టీ శ్రేణులను ఇప్పట్నుంచే ఎన్నికల ప్రచారంలో ఉండాలనే సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రతీ సభలో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ చెప్పుకుంటున్న వైయస్ జగన్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఏదేమైనా తన 9 వాగ్ధానాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy responded on his promises on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X