కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు కడపకు జగన్- మూడు రోజులు అక్కడే- స్వస్ధలంలో క్రిస్మస్‌ వేడుకలు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు.

సీఎం జగన్‌ ఈ నెల 24న పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండు, డిపో, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్కులకు జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

ys jagan three day kadapa tour from tomorrow, participate in christmas celeberations

24న ఉదయం 9.10 గంటలకు వైయస్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్‌ పాల్గొంటారు. ఆ తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 2.20 గంటలకు ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేస్తారు. 3.10 గంటలకు ఇమ్రా ఏపీకి, ఆ తర్వాత అపాచ్ లెదర్ డెవలప్ మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరిగి ఇడుపులపాయకు చేరుకుంటారు.

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

డిసెంబర్‌ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్తారు. చాలా రోజుల తర్వాత జగన్ స్వస్ధలానికి రానుండటంతో జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన్ను కలిసే అవకాశముంది. ఈ సందర్భంగా స్దానిక రాజకీయాలతో పాటు ఇతర అంశాలూ చర్చకు రానున్నాయి.

English summary
andhra pradesh chief minister ys jagan will go for three day kadapa tour from tomorrow,. there he will participate christmas celebrations and other development programmes also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X