• search
 • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ టీఆర్ఎస్ నేతకు జగన్ కీలక పదవి ఇవ్వనున్నారా ? ఎందుకలా ?

|
  ఆ టీఆర్ఎస్ నేతకు.. జగన్ కీలక పదవి ఇవ్వనున్నారా..??

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఏపీ పరిపాలనను అధ్యయనం చేయడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ పాలనలో తన మార్కు చూపించిన సీఎం జగన్ పలు కీలక ఉన్నతాధికారులను బదిలీ చేశారు. జూన్ 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పర్చుకొని పాలన సాగించాలని చూస్తున్న జగన్ అటు వివిధ శాఖల పై అధ్యయనం తో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల పైన కూడా దృష్టి సారించారు.

  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి .. ఎవరు ఎందుకు గెలిచారంటే ?

   టీటీడీ బోర్డు మెంబర్ గా తెలంగాణా టీఆర్ ఎస్ నాయకుడికి జగన్ అవకాశం ఇస్తారా

  టీటీడీ బోర్డు మెంబర్ గా తెలంగాణా టీఆర్ ఎస్ నాయకుడికి జగన్ అవకాశం ఇస్తారా

  ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎవరిని నియమించాలనే దానిపై దృష్టిసారించిన జగన్ టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ రేసులో చలనచిత్ర నటుడు ప్రముఖ విద్యావేత్త మోహన్ బాబు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కోన రఘుపతి తదితరులు టిటిడి బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తుండగా జగన్ తన బాబాయి వై వి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

  అంతేకాదు రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి ఒక టిఆర్ఎస్ నాయకుడికి టిటిడి బోర్డు నెంబర్ గా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

  మొదట నుండి ఖమ్మం జిల్లా నేతలకు టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం

  మొదట నుండి ఖమ్మం జిల్లా నేతలకు టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం

  మొదటి నుండి ఖమ్మం జిల్లా నుండి ఒకరికి టిటిడి సభ్యుడిగా అవకాశమిచ్చిన నేపథ్యం ఉంది. ఇక ప్రస్తుతం గతంలో వైయస్సార్సీపి నుండి ఎంపీగా గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం ఉన్నట్లు గా ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయలేదు. ఖమ్మం నుండి ఎంపీగా నామా నాగేశ్వరరావు పోటీచేసి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. కానీ పొంగులేటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన బాధ్యతలు పోషించారు.

  ఇక ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు టిటిడి బోర్డు మెంబర్ గా ప్రధానంగా వినిపిస్తుంది.

  గతంలో వైసీపీ లో క్రియాశీలక పాత్ర , తాజా సమీకరణాలతో పొంగులేటికి ఛాన్స్?

  గతంలో వైసీపీ లో క్రియాశీలక పాత్ర , తాజా సమీకరణాలతో పొంగులేటికి ఛాన్స్?

  గత టిడిపి ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతం నుండి టిటిడి బోర్డు సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య ను నియమించింది అయితే 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సండ్ర వెంకటవీరయ్య టిటిడి బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చెయ్యలేదు. దీంతో అతన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు లేదా కోనేరు చిన్నికి టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ అనూహ్యంగా టిడిపి ఓటమిపాలైంది. ఏ పిల్ల ప్రభుత్వ మార్పు జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలు నెరపుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖమ్మం నుండి టిటిడి బోర్డు సభ్యుడిగా గతంలో తమ పార్టీలో పనిచేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి అవకాశం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ తో జరిగిన జగన్ భేటీ సమయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ తో పాటుగా ఉన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh new chief minister Jagan Mohan Reddy is currently busy in overhauling the state administration. He already replaced several key officials at the top and is gearing up to form his cabinet on 8th June. Soon after that, Jagan will set his eyes on the nominated posts across the state, most importantly on Tirumala Tirupati Devasthanam board.YV Subba Reddy's name has now come up out of the blue. According to some political reports, a TRS leader from Telangana is likely to get selected as one of the board members. He's a former YSRCP MP from Khammam - Ponguleti Srinivas Reddy, who later joined TRS. But, the ruling party in Telangana did not give him the ticket in 2019 LS polls but he played a keyrole in YSRCP. the Change of government in AP and its cordial equation with TRS govt has now opened doors for Ponguleti.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more