వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర అభ్యంతాల‌పై నేరుగా ప్ర‌ధానితోనే: ఆగ‌స్టు 6న ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌: వెంక‌య్య నాయుడుతోనూ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోదీ,వెంక‌య్యతో భేటి కానున్న జ‌గ‌న్ || Jagan Going To Meet Modi And Vice President Venkaiah Naidu

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన కేంద్రం సీరియ‌స్‌గా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. పీపీఏల విష‌యంతో పాటుగా స్థానికుల‌కు ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల‌నే నిర్ణ‌యం పైన భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీని పైన కేంద్ర మంత్రులు నేరుగా అమిత్ షాతో చ‌ర్చించారు. ఇక‌..ఏపీకి బ‌డ్జెట్‌లో ఏ ర‌కంగానూ సాయం ప్ర‌క‌టించ‌క‌పోవ‌టంతో..ఇవ‌న్నీ నేరుగా ప్ర‌ధాని తో స‌మావేశ‌మై అన్ని అంశాలు చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం జెరూసెలం నుండి వ‌చ్చిన త‌రువాత రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముఖ్య‌మంత్రి వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది.

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..

గురువారం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జెరూసెలం వెళ్తున్న సీఎం జ‌గ‌న్ తిరిగి ఆగ‌స్టు నాలుగున రానున్నారు. ఆ వెం ట‌నే 6వ తేదీన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఇప్పటికే ప్ర‌ధాని మోదీ అప్పాయింట్‌మెంట్ సైతం ఫిక్స్ అయింది .రెండు రోజుల పాటు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీలోనే ఉంటారు. తాజాగా కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌లేదు. వైసీపీ ఎంపీలు బ‌డ్జెట్ లో ఏపీకీ కేటాయింపులు లేక‌పోవటం పైన అసంతృప్తి వ్య‌క్తం చేసా రు. సీఎం జ‌గ‌న్ నేరుగా దీని పైన స్పందించ‌లేదు. ఆ త‌రువాత అసెంబ్లీ స‌మావేశాల‌తో బీజీగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా..ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో పాటుగా ఇత‌ర కేంద్ర మం త్రుల‌ను సీఎం క‌ల‌వ‌నున్నారు. ఏపీకి ఆర్దికంగా తోడ్పాటు పైన వారితో చ‌ర్చించ‌నున్నారు. ఇదే స‌మంయ‌లో రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అందాల్సిన సాయం గురించి చ‌ర్చిస్తారు.

ప్ర‌ధానితో భేటీ..సందేహాల నివృత్తి..

ప్ర‌ధానితో భేటీ..సందేహాల నివృత్తి..

ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీతో ముఖ్య‌మంత్రి భేటీ ఖ‌రారైంది. ప్ర‌ధానితో భేటీ స‌మ‌యంలో ఏపీకి ఆర్దిక సాయంతో పాటుగా
ఏపీకి ప్ర‌త్యేక హోదా పైన ఇప్ప‌టికే తాను ఇచ్చిన విన‌తిని కేంద్రం నేరుగా 15వ ఆర్దిక సంఘానికి నివేదించింది. ఇదే అంశం మీద ఏపీ ప్ర‌భుత్వం సైతం విజ్ఞ‌ప్తి చేయ‌టంతో మ‌రోసారి ఆర్దిక సంఘం ప్ర‌తినిధుల‌కు లేఖ రాయాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీని పైన ప్ర‌ధాని మోదీతో మాట్లాడ‌నున్నారు. అదే స‌మ‌యంలో కొద్ది రోజులుగా ఏపీలో తీసుకుం టున్న నిర్ణ‌యాలు..వాటి అంచ‌నాల పైన ముఖ్య‌మంత్రి వివ‌రిస్తార‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా పీపీఏల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌మీక్ష‌కు తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైంది. దీని పైన కేంద్ర మంత్రి అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎంకు లేఖ రాసారు. అయితే, ప్ర‌ధాని తిరుమ‌ల వ‌చ్చిన స‌మ‌యంలోనే దీని పైన మోదీకి ఏపీ సీఎం వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు కోర్టుకు ఈ విష‌యం చేర‌టంతో..దీనికి సంబంధించిన పూర్తి వ్య‌వ‌హారాలు.. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవీతిని పైన వెలుగులోకి వ‌చ్చిన విష‌యాల‌ను ప్ర‌ధానిని వివ‌రించ‌నున్నారు.

ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడ‌తోనూ భేటీ..

ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడ‌తోనూ భేటీ..

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడుతో స‌మావేశం కాలేదు. కేవ‌లం ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో మిన‌హా ఆయ‌న్ను క‌ల‌వ‌లేదు. దీంతో ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో ఉప‌రాష్ట్రప‌తిని ఆగ‌స్టు 7న క‌ల‌వ‌నున్నారు. ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన ప్ర‌యోజ‌నాల పైన ఉప రాష్ట్రప‌తి సైతం ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో ఆయ‌న దృష్టికి ఇక్క‌డి స‌మ‌స్య‌లను తీసుకెళ్ల‌టంతో పాటుగా ప‌రిష్కారానికి స‌హ‌క‌రించ‌మ‌ని కోర‌నున్నారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ జ‌గ‌న్ భేటీ అవ్వ‌నున్నారు. ఆ స‌మ‌యంలో ఏపీలో రాజ‌కీయ అంశాల‌ను..బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌ల పైనా జ‌గ‌న్ చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.ఈ ప‌ర్య‌ట‌న ద్వారా జ‌గ‌న్ ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల పైన జ‌రుగుతున్న ప్ర‌చారానికి ముగింపు ప‌ల‌క‌టంతో పాటుగా రాజ‌కీయంగానూ స్ప‌ష్ట‌త తీసుకొచ్చే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.

English summary
AP Cm Jagan Delhi tour fixed on August 6th and 7th. CM going to meet Pm Modi and Vice president Venkaiah Naidu to co operate for AP in pending issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X