• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మడమ తిప్పేస్తున్న జగన్-అదను చూసి కరెంటు షాక్- చెలరేగుతున్న విద్యుత్ సంస్ధలు

|

ఏపీలో వైసీపీ విపక్షంలో ఉండగా.. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదని వైఎస్ జగన్ పదే పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చీ రాగానే యూటర్న్ తీసుకుని విద్యుత్ ఛార్జీల వడ్డన మాత్రం యథావిధిగా కొనసాగించేస్తున్నారు. దీనికి పెట్టుకున్న ముద్దు పేరు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు. ఇప్పటికే ఈ ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల కింద కేవలం 8 నెలల్లో రూ.3600 కోట్లు వసూలు చేయడం మొదలుపెట్టేసిన విద్యుత్ సంస్ధలు..ఇప్పుడు తాజాగా మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 కరెంటు ఛార్జీల మోత

కరెంటు ఛార్జీల మోత

ఏపీలో విద్యుత్ ఛార్జీల పేరుతో గతంలో ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి ఉండేది. 1995 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో విద్యుత్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడించి, చివరికి నిరసనకారులపై కాల్పుల దాకా వెళ్లింది అప్పట్లో టీడీపీ ప్రభుత్వ పతనానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి వైసీపీ సర్కార్ హయాంలో పరిస్ధితులు అంతవరకూ వెళ్లకపోయినా దానికి బీజాలు మాత్రం పడుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా విద్యుత్ సంస్ధలు చేస్తున్న అరాచకాలే ఇందుకు ప్రధాన కారణం.

ట్రూఅప్ పేరుతో పరోక్ష వడ్డన

ట్రూఅప్ పేరుతో పరోక్ష వడ్డన

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నేరుగా కాకుండా పరోక్ష పద్ధతుల్లో సాగుతోంది. విద్యుత్ సంస్ధలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనో, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే చవిచూసిన నష్టాలకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో డిస్కంలు డబ్పులు వసూలు చేసుకుంటున్నాయి. తద్వారా పాత నష్టాల్ని కొత్తగా వినియోగదారులపై వడ్డించేస్తున్నారు ఇప్పటికే రూ.3600 కోట్ల మేర ఈ నెల నుంచి ట్రూఅప్ ఛార్జీల పేరుతో మోత ప్రారంభమైపోగా... మరో మోతకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ ఈపీడీసీఎల్, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ ఎస్పీడీసీఎల్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.

వరుస వడ్డనలతో జనాలకు షాకులు

వరుస వడ్డనలతో జనాలకు షాకులు

తాజాగా విద్యుత్ పంపిణీ సంస్ధలు రూ.3600 కోట్ల మేర ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వడ్డన ప్రారంభించాయి. అదే సమయంలో మీడియాలో ఈ ఏడాది వడ్డన రూ.6వేల కోట్లుగా వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి రూ.6 వేల కోట్ల వార్తలు తప్పని వివరణ ఇచ్చింది. ఇది జరిగి నెల రోజులు కూడా కాలేదు తాజాగా విద్యుత్ పంపిణీ సంస్ధలు మరో రూ.2500 కోట్ల మేర ట్రూఅప్ ఛార్జీల వడ్డనకు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిని కూడా ఈఆర్సీ ఆమోదిస్తే త్వరలో రూ.2542 కోట్ల మేర ప్రజలపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

అదను చూసి ఛార్జీల మోత

అదను చూసి ఛార్జీల మోత

ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడిచింది. మరో మూడేళ్ల వరకూ సార్వత్రిక ఎన్నికలు లేవు. అలాగే పంచాయతీ, మన్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారం మాత్రం కోర్టుల్లో నానుతోంది. దీంతో రాజకీయంగా కూడా ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పోయాయి. అందుకే ప్రజల నుంచి, విపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను లెక్కచేయకుండా డిస్కంలు ఎడాపెడా ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తోంది.

  Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
  మడమ తిప్పేస్తున్న జగన్ ?

  మడమ తిప్పేస్తున్న జగన్ ?

  అధికారంలోకి రాకముందు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెరగవని, తగ్గుతాయని కూడా జగన్ హామీలు ఇచ్చారు. దీంతో ఈ హామీల్ని నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు విద్యుత్ సంస్ధలు ఎడాపెడా ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అనుమతిస్తోంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్ధలు హద్దు లేకుండా ట్రూఅప్ ఛార్జీలు పెంచుకుంటామంటూ ఈఆర్సీని ఆశ్రయిస్తున్నాయి.

  ఈఆర్సీ కూడా ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను లెక్కచేయకుండా ఛార్జీల పెంపుకు ఉదారంగా అనుమతులు ఇచ్చేస్తోంది. దీంతో జనానికి ఛార్జీల మోత తప్పడం లేదు. ఈ వ్యవహారమంతా చూస్తున్న వారికి గతంలో వైఎస్ జగన్ చెప్పిన మాట తప్పను మడమ తిప్పను డైలాగ్ గుర్తుకొస్తోంది. ఇప్పుడు జగన్ ఎందుకు మడమ తిప్పాల్సిన పరిస్దితి వస్తోందన్నది బహిరంగ రహస్యమే.

  English summary
  ap discoms face severe criticism from customers on their new proposals for hike through true up adjustment charges.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X