వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పనికిరాడనే తెరపైకి ప్రశాంత్ కిషోర్, ఆ రోజు జగన్ పాదయాత్రనా, కోర్టుకా?'

వైసిపి అధినేత జగన్ వయస్సు తక్కువ, ఆశ, కోరికలు మాత్రం చాలా ఉన్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ఎద్దేవా చేశారు. ఎవరు కూడా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని భావించడన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్ వయస్సు తక్కువ, ఆశ, కోరికలు మాత్రం చాలా ఉన్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ఎద్దేవా చేశారు. ఎవరు కూడా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని భావించడన్నారు.

<strong>పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?</strong>పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?

చంద్రబాబు ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని వైసిపి అదినేత జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన చెప్పిన లెక్క రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని నిలదీశారు.

జగన్ రాజకీయాలకు పనికి రాడని..

జగన్ రాజకీయాలకు పనికి రాడని..

వైయస్ జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికి రాడనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. వైసిపి ప్లీనరీలో నిర్మాణాత్మక విషయాలపై చర్చించలేదని చెప్పారు.

Recommended Video

Nagarjuna Akkineni to Join YSRCP? Breaking News!
ఆ రోజు శుక్రవారం.. కోర్టుకా, పాదయాత్రనా?

ఆ రోజు శుక్రవారం.. కోర్టుకా, పాదయాత్రనా?

జగన్ అక్టోబర్ 27వ తేదీన పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారని, ఆ రోజు శుక్రవారం అవుతుందని, మరి ఆయన ఆ రోజున కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతారా లేక పాదయాత్ర చేస్తారా చెప్పాలని నిలదీశారు.

ఏ నేతకు ఉండదు

ఏ నేతకు ఉండదు

జగన్ వయస్సు చాలా తక్కువ అని, ఆశ మాత్రం చాలా ఉందని పత్తిపాటి మండిపడ్డారు. ముప్పై ఏళ్లు సిఎంగా ఉండాలనేది తన ఆశ అని జగన్ స్వయంగా చెబుతున్నారని, కానీ ఏ నేతకు కూడా అంత ఆశ ఉండదని చెప్పారు.

ఆదర్శంగా నిలిచాం

ఆదర్శంగా నిలిచాం

రుణమాఫీలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పత్తిపాటి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అన్నారు. రేషన్ దుకాణాల్లో పంచదార, కందిపప్పు, మినపప్పు, నూనెలను సెప్టెంబర్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పత్తిపాటి ఇంకా మాట్లాడుతూ.. మాల్స్‌లో కూల్ డ్రింక్స్ అధిక రేట్లకు అమ్మితే కేసులు పెడతామన్నారు.

English summary
Minister Pattipati Purlla Rao on Monday said that YSRCP chief YS Jagan unfit for politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X