• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బరువెక్కిన హృదయంతో!: ఆ నిర్ణయం వెనుక.., రాష్ట్రపతికి జగన్ లేఖ

|

హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు లేఖ రాశారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని రాష్ట్రపతికి నివేదించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. తాము సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని తెలియజేస్తూ ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తమ పార్టీలో చేర్చుకుందని, కానీ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో మాత్రం వారిని ఇంకా వైసీపీ సభ్యులుగానే చూపుతున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఐదు పేజీలతో కూడిన ఆ లేఖను పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.

 లేఖలో ఏముంది:

లేఖలో ఏముంది:

ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ ఏకైక, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా బాహాటంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో మా పార్టీ టికెట్లపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని మంత్రి పదవుల ఆశజూపి, భారీగా నగదును ఇస్తామని ప్రలోభపెట్టి మీడియా సాక్షిగా టీడీపీలోకి చేర్చుకున్నారు.

 నిస్సిగ్గు రాజకీయం:

నిస్సిగ్గు రాజకీయం:

పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నిబంధనలను అనుసరించి అనర్హులుగా చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు, శాసనమండలి ఛైర్మన్‌కూ మేము పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అంతేకాదు!, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయిన ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియను రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కట్టబెట్టారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

చర్యలు తీసుకునే వరకు:

చర్యలు తీసుకునే వరకు:

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనంతవరకు తాము అసెంబ్లీ గడప తొక్కమని లేఖలో జగన్ రాష్ట్రపతికి స్పష్టం చేశారు. ఫిరాయించిన 21 మంది (ప్రస్తుతం 20 మంది) ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీపై శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, మంత్రులైన నలుగురినీ తప్పించాలనీ డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంపై దాడి అని భావించినందునే తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నామని తెలిపారు.

 మాఫియా రాజ్యం:

మాఫియా రాజ్యం:

ఆచరణ సాధ్యం కాని హామిలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మాఫియా తరహా పాలన నడుస్తోందంటూ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం అండతో, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా అవతారం ఎత్తారని ఆరోపించారు. రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకునేలాగా కాల్‌మనీ సెక్స్‌ కుంభకోణానికి కూడా తెరలేపారని ఆరోపించారు.

 అడ్డగోలుగా ప్రాజెక్టుల ఖర్చులు పెంచి:

అడ్డగోలుగా ప్రాజెక్టుల ఖర్చులు పెంచి:

-తాత్కాలిక భవనాలను వాస్తవం కన్నా మూడింతల అధిక వ్యయంతో నిర్మాణం

-పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్టును వాస్తవం కన్నా రెండింతలు ఎక్కువ వ్యయంతో నిర్మాణం
-జీవో ఎంఎస్‌ నెంబర్‌ 22, తేదీ 23 ఫిబ్రవరి 2015 ద్వారా గతంలో చేసిన పనులకూ -వ్యయాన్ని పెంచుతూ సివిల్‌ కాంట్రాక్టర్లకు మేలు చేసిన ప్రభుత్వం
నీటిపారుదల ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులకు సైతం ఇష్టానుసారి వ్యయం పెంపు

 బరువెక్కిన హృదయంతో:

బరువెక్కిన హృదయంతో:

ఇన్ని ఆగడాలకు పాల్పడుతున్నా.. అవమానభారాన్ని మౌనంగా భరించి తప్పుచేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఎదురుచూశాం. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన మాకు నిరాశే మిగలడంతో బరువెక్కిన హృదయంతో ఈ శాసనసభ సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వంలోకి తీసుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారో తెలియని పరిస్థితులున్నాయంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం కాదా?.. దయచేసి ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఈ పరిహాసాన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నామని జగన్ లేఖను ముగించారు.

English summary
YS Jagan Urges President Kovind To Debar Turncoat MLAs. ... In a five-page letter written to President Ramnath Kovind, YS Jagan explained
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X