వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ప్రజలను మరువను: జగన్, షర్మిల రోడ్ షో(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విశాఖ/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి, విశాఖపట్నం జిల్లాలో విజయమ్మ, చిత్తూరు జిల్లాలో షర్మిల తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి తాను సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయినా.. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలో ఆగిపోయిన ఓదార్పు యాత్రను తన సోదరి షర్మిల పూర్తి చేస్తారని చెప్పారు. తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పెద్ద కుటుంబంలో భాగమైన తెలంగాణ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించనని అన్నారు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే వారి సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది ఇలా ఉండగా విశాఖపట్నం జిల్లా అరకులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినట్లయితే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అన్నారు.

సత్తుపల్లిలో జగన్..

సత్తుపల్లిలో జగన్..

తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి తాను సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయినా.. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనని అన్నారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయించడానికి కృషి చేస్తానని వైయస్ జగన్ తెలిపారు. తెలంగాణలో ఆగిపోయిన ఓదార్పు యాత్రను తన సోదరి షర్మిల పూర్తి చేస్తారని చెప్పారు.

షర్మిల ప్రచారం..

షర్మిల ప్రచారం..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే వారి సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

అరకులో విజయమ్మ..

అరకులో విజయమ్మ..

విశాఖపట్నం జిల్లా అరకులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని ఆరోపించారు.

English summary
YSR Congress Party leaders YS Jaganmohan Reddy and YS Vijayamma and Sharmila campaigned in various places in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X