అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్లో కల్తీ మద్యం తాగిన ఘటన అటు పాలకపక్ష నేతలనే కాదు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను సైతం కలచివేసింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా, 29 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ సందర్భంగా మంగళవారం కల్తీమద్యం బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వెళ్లిన వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పేరు పేరునా పలకరించారు. వారితో మాట కలిపారు. వారి వేదనను ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు.

‘‘అన్నా.. మళ్లీ మద్యం తాగకు, ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకు. ప్రాణాల మీదకు తెచ్చుకోకు. నీ కుటుంబాన్ని మద్యం ఇబ్బంది పెడుతోంది. ఇకనైనా మద్యం మానేయండి'' అంటూ వైయస్ జగన్ బాధితులను కోరారు. ఆ తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన జగన్, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో మృతదేహాలను పరిశీలించి, అక్కడకు చేరిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, సెంటిని, ఆంధ్రా హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు.

ఒక్కొక్కరిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆంధ్ర హాస్పిటల్ ఎండీ రమణమూర్తి, సెంటిని హాస్పిటల్ ఈడీ ఆనందశ్రీనివాస్ మద్యం బాధితుల వివరాలను జగన్‌కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

సూర్యుడు ఠంచనుగా ఉదయిస్తాడో లేదో నాకు తెలియదని, కానీ మద్యం దుకాణాలు మాత్రం ఉదయం ఆరు గంటలకే తెరుస్తున్నారని, రాత్రి రెండు మూడు గంటల వరకు తెరిచి ఉంచుతున్నారన్నారు. రోజంతా మద్యం దుకాణాలు తెరిచి ఉంటే ఎలా అని ప్రశ్నించారు. రోజురోజు మరింత ఎక్కువ మద్యం ప్రజలతో తాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం కూడా పోస్తున్నారని, దీనికి బాధ్యత ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, కల్తీ మద్యం పోస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం దుకాణం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

మద్యం అమ్మకాలు 2014లో 6,632 కోట్లు అయితే, ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ.7050 కోట్లు దాడిందన్నారు. గత ఏడాది కంటే మద్యం అమ్మకాలు రెట్టింపు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందన్నారు. మద్యం దుకాణదారులు సమయపాలన పాటించడం లేదన్నారు. సాక్షాత్తు మంత్రి గ్రామంలోనే బెల్టు షాపు ఉందన్నారు.

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

అన్నా... మళ్లీ మద్యం తాగకు!: కల్తీ మద్యం బాధితులను కోరిన జగన్

ఇది మారాలని చెప్పారు. గుజరాత్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉందని, అయినప్పటికీ ఆ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. బీహార్ కూడా మద్యం నిషేధం దిశగా అడుగేసిందన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మద్యం నిషేధం చేస్తాడని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారో, చేయరో తనకు తెలియదన్నారు. 2019లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అప్పుడు మేం సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారు.

English summary
YSR Congress Party supremo YS Jagan Mohan Reddy said that his party would ban liquor in Andhra Pradesh after coming to power in the next elections but exempted the five-star hotels where only rich people can drink liquor and that won't affect the common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X