వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ జైలు నుండి బయటకు, నాడు జనాల్లో(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇక జనంలోకి రానున్నారు. పదహారు నెలలుగా జైలులో ఉన్న వైయస్ జగన్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల కానున్నారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చిన జగన్ ఓదార్పు యాత్ర, దీక్షల పేరుతో నిత్యం ప్రజల్లో ఉన్నారు.

నిరుడు మే 27న అరెస్టయ్యాక ఆయనకు బదులు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలలు ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు జగన్ బయటకు వస్తుండటంతో ఇక మళ్లీ ఆయన జనం బాట పట్టనున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉండటంతో ఆయన ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారనోనని అందరిలోను ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెసుకు, జగన్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని, అందుకే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అదే సమయంలో గతంలోలాగా ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెట్టే అవకాశాలున్నాయి.

జైలు నుండి బయటకొస్తూ జగన్

జైలు నుండి బయటకొస్తూ జగన్

నిరుడు మే 27న అరెస్టైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు చంచల్ గూడ జైలు నుండి బయటకు వస్తున్న దృశ్యం.

కోర్టుకు

కోర్టుకు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న దృశ్యం.

జగన్

జగన్

అక్రమాస్తుల కేసులో అరెస్టు కాకముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

కోర్టుకు హాజరయ్యేందుకు

కోర్టుకు హాజరయ్యేందుకు

అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వస్తున్న దృశ్యం.

జనంలో

జనంలో

ఆస్తుల కేసులో అరెస్టు కాకముందు జనంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

అభివాదం

అభివాదం

అరెస్టుకు ముందు ఓ కార్యక్రమంలో తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడి అభివాదం.

పార్లమెంట్ నుండి బయటకు

పార్లమెంట్ నుండి బయటకు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల అనంతరం బయటకు వస్తున్న దృశ్యం.

English summary
A day after YSR Congress Party chief YS Jaganmohan Reddy was granted bail in the DA case, the YSR Congress chief will walk out free on Tuesday after spending nearly 16 months in the Chanchalguda Central Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X