కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటనక్కలకు కాదు: పోలీస్ బాస్‌లకు జగన్ వార్నింగ్, కుర్చీలు లేనందుకు మహిళలకు సారీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో పోలీసు బాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదని

|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో పోలీసు బాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

Recommended Video

Ys Jagan implementing tdp strategy

చదవండి: జగన్ గురించి మాట్లాడటం కంటే: బాబు, ప్యాకేజీపై షాకింగ్, పవన్ కళ్యాణ్-జగన్‌లకు ఝలక్

చదవండి : మహిళా సదస్సులో వరాలు: రోజా-జగన్‌కు గట్టి షాకిచ్చిన పోలీసులు, ఇదీ అసలు విషయం!

మహిళా సదస్సును నిర్వహించారు. దీనికి అనుమతి లేదు. పోలీసులు పలువురు మహిళలు సదస్సుకు రాకుండా అడ్డుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ స్పందించారు.

చదవండి: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?

ఒక్కటి గుర్తుంచుకోండి

ఒక్కటి గుర్తుంచుకోండి

నేను పోలీసులకు ఒక్కటే చెబుతున్నానని, మీరు పని చేస్తోంది ప్రభుత్వానికి అనే విషయం గుర్తుంచుకోవాలని జగన్ హితవు పలికారు. మీరు పని చేస్తోంది మీ నెత్తి మీది టోపీ పైన ఉన్న మూడు సింహాలకు అని మరిచిపోవద్దని ఆయన సూచించారు.

గుంటనక్కలకు సెల్యూట్ కొట్టేందుకు కాదు

గుంటనక్కలకు సెల్యూట్ కొట్టేందుకు కాదు

కానీ ఆ సింహాల వెనుక గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదని మరిచిపోవద్దని జగన్ అన్నారు. పోలీస్ బాసులకు కూడా నేను అదే విషయం చెబుతున్నానని, ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదన్నారు. ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

కుర్చీలు లేకపోవడంతో సారీ చెప్పిన జగన్

కుర్చీలు లేకపోవడంతో సారీ చెప్పిన జగన్

ఇదిలా ఉండగా, తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహిళా సదస్సుకు భారీగా మహిళలు తరలి రావడంతో వారంతా కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితిని చూసి జగన్ చలించిపోయారు. చాలామంది అక్కచెల్లెమ్మలు నిలుచునే ఉన్నారని, కుర్చీలు లేకపోయినందుకు సారీ తల్లీ అని, కుర్చీలు అయిపోయాయని, పూర్తిగా నిండిపోయాయని,అయినా మీరంతా నిలుచునే ఉన్నారు, మీకు సారీ అండీ అన్నారు.

ఉత్సాహం, మరిన్ని మహిళా సదస్సులు

ఉత్సాహం, మరిన్ని మహిళా సదస్సులు

మహిళా సదస్సు విజయవంతం కావడంతో వైసీపీలో ఆనందం వెల్లివిరుస్తోంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. దీంతో పాదయాత్ర సమయంలో మరిన్ని మహిళా సదస్సులు నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ ఆలోచిస్తోంది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy has warned police and police boss in his Praja Sanklpa Yatra in Kurnool district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X