• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిందితురాలిగా జగన్‌ సతీమణి భారతి పేరు... ఇదే మొదటిసారి:అసలేం జరిగిందంటే?

By Suvarnaraju
|
  నిందితురాలిగా జగన్‌ సతీమణి భారతి పేరు

  హైదరాబాద్‌:జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిని ఈడీ నిందితురాలిగా చేర్చింది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రొకో కేసులో వైఎస్ జగన్ తో పాటు భారతిని కూడా ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖాలు చేసింది.

  ఈ కేసులో భారతి పేరు తొలిసారి చార్జీషీటులోకి ఎక్కడం గమనార్హం కాగా...ఈడీ చార్జీషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణకోసం జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.

  భారతిపై...అభియోగాలు నమోదు

  భారతిపై...అభియోగాలు నమోదు

  వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ కేసులోనే తొలిసారిగా జగన్ సతీమణి భారతిపై ఇలా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సిబిఐ అభియోగ పత్రాలలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ సీబీఐ భారతిని నిందితురాలిగా చేర్చలేదు. అయితే సీబీఐ వదిలేసినా...ఈడీ దర్యాప్తులో మాత్రం భారతి ని నిందితురాలిగా పేర్కొంది.

  కోర్టుకు...వ్యక్తిగతంగా హాజరుకావాలి

  కోర్టుకు...వ్యక్తిగతంగా హాజరుకావాలి

  మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద భారతిపేరు ఛార్జిషీట్ లో చేర్చారు. భారతి సిమెంట్స్‌ మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన తాజా ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది. మరోవైపు
  జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

  కేసు...పూర్వాపరాలు

  కేసు...పూర్వాపరాలు

  కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో నాణ్యమైన సున్నపురాయి నిల్వలు ఉండటంతో ఈ ప్రాంతంలో సి.రామచంద్రయ్య అనే పారిశ్రామికవేత్త రఘురామ్‌ సిమెంట్స్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ తరువాత రఘురామ్‌ సిమెంట్స్‌ ను జగన్ కంపెనీ టేకోవర్‌ చేసి ఆ కంపెనీ పేరు భారతి సిమెంట్స్‌గా మార్చారు. మరోవైపు మైనింగ్‌ చేసుకునేందుకు అంబుజా సిమెంట్స్‌కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్‌ లీజును పక్కనబెట్టి రఘురామ్‌/భారతి సిమెంట్స్‌కు తప్పుడు పద్ధతుల్లో 2037 ఎకరాల సున్నపురాయి గనులున్న ప్రాంతాన్ని లీజుకు కేటాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  ఇంటికొచ్చి మరీ...రుణం ఇచ్చారు

  ఇంటికొచ్చి మరీ...రుణం ఇచ్చారు

  సాధారణంగా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకునేవారు బ్యాంకుకు వెళ్లి...వాళ్లు కోరిన పత్రాలు చూపించి...అడిగిన ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడం...గ్యారెంటీలు పెట్టడం...ఇలా అనేక లాంఛనాలు పూర్తి చేశాక, అప్పటికీ అంతా ఓకే అనుకుంటే తప్ప లోన్ ఇవ్వరు...కానీ... వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారులు వారే సీఎం నివాసానికి వెళ్లి జగన్‌ను కలిసి...ఆయన సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. భారతీ సిమెంట్స్‌ కోసం రూ.200 కోట్ల టర్మ్‌ రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని...రుణం కోసం దరఖాస్తులో తప్పుడు వివరాలు పేర్కొన్నట్లుగా తెలిసింది.

  సిబిఐ ఛార్జిషీట్...ఈడీకి అదే ఆధారం

  సిబిఐ ఛార్జిషీట్...ఈడీకి అదే ఆధారం

  భారతీ సిమెంట్స్‌ ద్వారా జగన్‌ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేసింది. సిలికాన్‌ సంస్థలో నిమ్మగడ్డ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను మళ్లించడం ద్వారా వేల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సిబిఐ తన ఛార్జిషీటులో పేర్కింది. అయితే తదనంతరం భారతి సిమెంట్స్‌లో 49 శాతం వాటాలను ఫ్రెంచి కంపెనీకి విక్రయించగా ఓనరషిప్ మేనేజ్మెంట్ అథారిటీ మాత్రం జగన్‌ గ్రూప్‌ చేతిలోనే ఉండటం గమనార్హం.

  English summary
  Hyderabad: In a major development in the illegal investments case of Y.S. Jagan Mohan Reddy, the ED has shown Bharathi, wife of Y.S. Jagan, as an accused in the Bharathi Cements case in the chargesheet filed before the Special CBI court of the city.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X