వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: కాబోయే సీఎం జగన్, పవన్ కళ్యాణ్‌కు అందనంత ఎత్తులో, ఎవరికి ఎంతమంది ఓటేశారంటే?

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్, ప్రీపోల్ సర్వేలపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. పలు సంస్థలు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, అదే సమయంలో లోకసభతో పాటు జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముందంజలో నిలుస్తారనే దానిపై సర్వేలు చేస్తున్నారు.

టైమ్స్ మెగా పోల్ సర్వే: 84% మంది మోడీకే ఓటు, రాహుల్‌కు 8%, అచీవ్‌మెంట్స్ సహా ఈ ప్రశ్నలపై ఇలా.. టైమ్స్ మెగా పోల్ సర్వే: 84% మంది మోడీకే ఓటు, రాహుల్‌కు 8%, అచీవ్‌మెంట్స్ సహా ఈ ప్రశ్నలపై ఇలా..

 వైసీపీకి ఎక్కువ మార్కులు

వైసీపీకి ఎక్కువ మార్కులు

ఇందులో భాగంగా ఇండియా టుడే ఛానల్ నిర్వహించిన సర్వేలో వైసీపీకి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కానున్నారని ఈ ఛానల్ నిర్వహించే పొలిటికల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం వెల్లడించిందట. తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల మనోగతంపై పొలిటికల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎప్పటికి అప్పుడు విడతలవారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంది. యాంకర్ రాహుల్ కమల్ ఈ నెల 18వ తేదీన నిర్వహించిన ఈ లైవ్ షో కార్యక్రమంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయట.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌కే ఎక్కువ మంది ఓటు

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌కే ఎక్కువ మంది ఓటు

ఏపీ ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారని 'యాక్సెస్ మై ఇండియా' ద్వారా ప్రశ్నించగా 45 శాతం మంది జగన్ వైపు మొగ్గు చూపారు. 36 శాతం మంది చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలోను ఇలాగే సర్వే చేశారు. అప్పుడు జగన్‌ను 43 శాతం మంది, చంద్రబాబును 38 శాతం మంది కోరుకున్నారు. ఆరు నెలల తర్వాత చేసిన తాజా (ఫిబ్రవరి) సర్వేలో వైసీపీ అధినేతకు రెండు శాతం పెరగగా, టీడీపీ అధినేతకు రెండు శాతం తగ్గింది. ప్రస్తుతం సీఎం కంటే ప్రతిపక్ష నేత 9 శాతం ఆధిక్యంలో ఉన్నారు.

 పవన్ కళ్యాణ్‌కు అందనంత ఎత్తులో జగన్

పవన్ కళ్యాణ్‌కు అందనంత ఎత్తులో జగన్

2014లో వైసీపీ, టీడీపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఇప్పుడు 2019లోను ఈ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని తాజా సర్వేలో వెల్లడైందట. అయితే జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలు జనసేనను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఈ పార్టీని పరిగణలోకి తీసుకుంటే మాత్రం భారీగా మార్పులు ఉంటాయి. కానీ తాజాగా సర్వేలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ ముఖ్యమంత్రి కావాలనుకునే వారి శాతం క్రమంగా తగ్గుతోందట. గత సెప్టెంబర్‌లో పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవారు 5 శాతంగా ఉంటే, తాజా సర్వేలో కేవలం 4 శాతం కోరుకున్నారట.

English summary
National TV channel declared on the basis of a survey that Leader of Opposition in Andhra Pradesh Legislative Assembly and YSR Congress party president, YS Jagan Mohan Reddy will become the next chief minister of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X