• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త ట్విస్ట్: హైకోర్టులో జగన్‌కు షాక్, హుటాహుటిన గవర్నర్ వద్దకు!

|

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది.

'జగన్ పార్టీలో 10మంది దొంగలు, అన్నొస్తున్నాడా లేక.. దొంగొస్తున్నాడా'

తనపై దాఖలు చేసిన కేసులను అన్నింటిని కలిపి ఒకేసారి విచారించాలని జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌ను సంస్థల పిటిషన్‌ను సిబిఐ కోర్టు గతంలో తిరస్కరించింది.

సిబిఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం హైకోర్టులో జగన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

హైకోర్టు చెప్పడంతో..

హైకోర్టు చెప్పడంతో..

తన సొంత మీడియా (జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌)లో పెట్టుబడులకు సంబంధించిన కేసులన్నింటినీ కలిపి విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ గురువారం హైకోర్టు తిరస్కరిస్తామని చెప్పడంతో, జగన్ తరఫు న్యాయవాదులు వెనక్కి తీసుకున్నారు.

ఏం జరిగిందంంటే..

ఏం జరిగిందంంటే..

వాస్తవానికి తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన మూడు చార్జిషీట్లను కలిపి విచారించాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌ గతంలో ఓ పిటిషన్‌ వేశారు. దానిని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది మార్చి 9న విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి శివశంకర్‌రావు ఆయా కేసుల్లో సీబీఐ కోర్టులో చార్జెస్‌ ఫ్రేమ్‌ చేయడంపై తాత్కాలిక స్టే విధించారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె సురేంద్రరావు వాదించారు.

  Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
  ఆ కేసుకు... ఈ కేసుకు సంబంధం లేదు

  ఆ కేసుకు... ఈ కేసుకు సంబంధం లేదు

  జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో ఇంకా పూర్తిగా అభియోగాలు నమోదు కాలేదని, ఈ దశలో చార్జీషీట్లను అన్నింటిని కలిపి విచారణ జరిపించాలని కోరడం, విచారణను జాప్యం చేసేందుకేనని సిబిఐ తరఫు లాయర్ చెప్పారు. ఒక కేసుకు, మరో కేసుకూ సంబంధం లేదని, వేర్వేరుగా లావాదేవీలు జరిగినందున చార్జిషీట్లను కూడా వేర్వేరుగానే దాఖలు చేశామన్నారు.

  జగన్ తరఫున..

  జగన్ తరఫున..

  చార్జిషీట్లు కలిపి విచారించాలని నిందితులు కోరలేరని, సీఆర్‌పీసీ చట్టంలోనూ అలాంటి వెసులుబాటు లేదని, అభియోగాల నమోదుకు ముందే ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని సిబిఐ తరఫు లాయర్ స్పష్టం చేశారు. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, టి నిరంజన్‌ రెడ్డిలు వాదించారు. సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో 8 కేసుల్లో స్టే ఆదేశాల వల్ల విచారణ నిలిచిపోయిందని, కేవలం మూడు కేసుల్లోనే వాదన జరుగుతోందని తెలిపారు. ఈ కేసుల్లో తాము వాదనలు వినిపిస్తుండగా మిగిలిన వాటికి సంబంధించిన లోపాలను సీబీఐ సరిదిద్దుకుంటోందన్నారు.

  వెంటపడటం సరికాదు..

  వెంటపడటం సరికాదు..

  ఎప్పటికప్పుడు అదనపు చార్జిషీట్లు దాఖలు చేస్తోందని జగన్ తరఫు లాయర్ చెప్పారు. ఇలా వెంటాడటం న్యాయ సమ్మతం కాదని తెలిపారు. మూడు చార్జిషీట్లను కలిపి విచారణ జరపాలని వారు కోరారు. ఈ వాదనలతో జడ్జి విభేదించారు. చార్జిషీట్లన్నింటినీ కలిపి విచారణ జరపాలని నిందితులు కోరలేరన్నారు. జగన్‌ పిటిషన్లను కొట్టివేయడానికి సిద్ధమయ్యారు. దీంతో, వాటిని తామే ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని జగన్‌ తరఫు లాయర్లు అభ్యర్థించారు. ఇందుకు జడ్జి అంగీకరించారు.

  హుటాహుటిన గవర్నర్‌ వద్దకు...

  హుటాహుటిన గవర్నర్‌ వద్దకు...

  కాగా, గురువారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ సమావేశమయ్యారు. చార్జిషీట్లను కలిపి విచారించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసిన కాసేపటికే జగన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదికూడా తాను అధికారికంగా వాడే వాహనం కాకుండా, మరో వాహనంలో ఒంటరిగా వెళ్లారు. సుమారు గంటకుపైగా ఆయన చర్చలు జరిపారని అంటున్నారు. అయితే, రాజకీయ నాయకులు గవర్నర్‌ను కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇస్తుంటారు.

  English summary
  With the High Court at Hyderabad expressing its disinclination to admit the writ petition moved by YSRCP President Y S Jaganmohan Reddy seeking a joint trial of the three charge-sheets filed by the CBI in the special court, the counsel withdrew the petition.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X