వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్యకర్త నుండి నన్ను ఎంపీని చేశారు వైఎస్ ..ఉండవల్లి అరుణ్ కుమార్

|
Google Oneindia TeluguNews

ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా తాను ఎదగటానికి వైఎస్సార్ కారణం అని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన వైయస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన వైఎస్సార్ తో తన అనుబంధం గురించి చెప్పారు.

ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపు.. అసలు అభ్యంతరం హరికృష్ణ విగ్రహం వల్లేనట..ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపు.. అసలు అభ్యంతరం హరికృష్ణ విగ్రహం వల్లేనట..

కేవీపీ సతీమణి కోరిక మేరకు వైఎస్సార్ పై పుస్తకం రాశానన్న ఉండవల్లి అరుణ్ కుమార్

కేవీపీ సతీమణి కోరిక మేరకు వైఎస్సార్ పై పుస్తకం రాశానన్న ఉండవల్లి అరుణ్ కుమార్

వైయస్సార్ తో ఉండవల్లి అరుణ్ కమార్ కొన్ని సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తను రాసిన పుస్తకంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దైవ సమానుడని ఆవిష్కరణ చేసే ప్రయత్నం చెయ్యలేదన్నారు ఉండవల్లి. తనను వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పుస్తకం రాయాలంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీత కోరారని చెప్పారు. వైఎస్సార్ పై పుస్తకం రాయటం అంటే మామూలు విషయం కాదన్న ఉండవల్లి తనలాంటి వాళ్లు రాజశేఖర్ రెడ్డి జీవితంలో వేలమంది ఉంటారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

తనను ఒక కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా చేసిన ఘనత వైఎస్సార్ దే అన్న ఉండవల్లి

తనను ఒక కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా చేసిన ఘనత వైఎస్సార్ దే అన్న ఉండవల్లి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను ఒక కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. అప్పుడు ఏర్పడిన పరిచయం తనను ఎంపీగా చేసిందని ఆయన చెప్పుకున్నారు. 1983 నాటికే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో చిన్న కార్యకర్తనని స్పష్టం చేశారు. అలాంటి కార్యకర్తను వైఎస్ ఎంపీని చేశారని అప్పటి వరకు తనకు ఆయనతో ఉన్న అనుభవాలను రాశానని చెప్పుకొచ్చారు. మొదట పుస్తకం రాయటానికి సాహసించలేదు కానీ తర్వాత పుస్తకం రాశానని ఆయన అన్నారు .అయితే ఎమ్మెస్కో, సునీతల ప్రోత్సాహంతో తానే రాశానని చెప్పుకొచ్చారు.

రాజశేఖర్ రెడ్డి జీవితం ఓపెన్ బుక్ .. పుస్తకావిష్కరణ సభలో ఉండవల్లి

రాజశేఖర్ రెడ్డి జీవితం ఓపెన్ బుక్ .. పుస్తకావిష్కరణ సభలో ఉండవల్లి

పుస్తకం రాయాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు కేవీపీ రాస్తే బాగుండేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదేపదే చెప్పేవారని తన ఆత్మ కేవీ అని కేవీపీ పుస్తకం రాస్తే బాగుంటుందని తాను భావించినట్లు చెప్పుకొచ్చారు. కేవీపీ రాస్తే ప్రజలకు తెలియని కొన్ని సంఘటనలు బయటకు వచ్చేవన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఓపెన్ బుక్ అన్నారు. ఆయన జీవితంలో సీక్రెట్ అంటూ ఏమీ ఉండదన్నారు ఉండవల్లి . ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ధీరోదాత్త అన్ని అసమ్మతి నుంచి నెగ్గుకు రాగలిగారని ఉండవల్లి చెప్పారు. అనంతరం పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు అన్నింటిని తాను తన పుస్తకంలో పొందుపరచినట్లు తెలిపారు.

English summary
Undavalli Arun kumar said that he was an activist when YS Rajasekhar Reddy was party president. He said that the introduction was made to him as an MP. As of 1983, YSR worked as president of the PCC. YSR made me an MP who is a small activist in rajamundry .Undavalli said that YSR life is a open book . there is no secrets. Undavalli spoke about YSR in a book inaugural function that was written by him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X