వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పనితీరు బాగుందని, జగన్ సర్కారును టీడీపీ గట్టిగానే ప్రశ్నిస్తోందన్న వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రతిపక్షం లేదన్న లోటును పూడ్చుతూ, ప్రజలకు గొంతుకగా ఉంటానని చెప్పుకున్న దరిమిలా కదన రంగంలోకి దూకేందుకు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఆవేశం కలిగిన యువత, ఆలోనలు చేసే సీనియర్లకు సమాన ప్రాధాన్యం ఇస్తూ కీలక అడుగులు వేస్తున్నారు. షర్మిల సైన్యంలో ఉన్నత పదవులకు సంబంధించి ఇప్పటికే కీలక నియామకాలు కొనసాగుతుండగా.. ఉద్యమాల పురిటిగడ్డగా పేరుపొందిన వరంగల్ జిల్లా నుంచి కూడా తురుపుముక్కలు చేరబోతున్నట్లు తెలుస్తోంది..

అజిత్ దోవల్ రహస్య మంతనాలు -భారత్, పాకిస్తాన్ సైన్యాల కీలక నిర్ణయం -ఇకపై సరిహద్దులో..అజిత్ దోవల్ రహస్య మంతనాలు -భారత్, పాకిస్తాన్ సైన్యాల కీలక నిర్ణయం -ఇకపై సరిహద్దులో..

వైఎస్సార్ సన్నిహితులు..

వైఎస్సార్ సన్నిహితులు..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన షర్మిల.. జిల్లాల వారీగా నేతలతో మంతనాలు పూర్తయిన వెంటనే అధికారికంగా పార్టీ పేరును, అజెండాను, విధివిధానాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10లోగా ప్రక్రియ పూర్తవుతుందని ఆమె అనుచరులు చెబుతున్నారు. కాగా, 'కథన రంగంలో యువనేతలు.. వ్యూహ రచనలో సీనియర్లు' అనే విధానంతో మంత్రాంగం నడుపుతోన్న షర్మిల.. తన తండ్రి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్ నేతలను ఒక్కొక్కరిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్యనాయకులూ ఉన్నట్లు సమాచారం..

ఇద్దరు మాజీ మంత్రులు..

ఇద్దరు మాజీ మంత్రులు..

వైఎస్సార్ జమానాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం కళగ్గి, సరైన మలుపు కోసం ఎదురుచూస్తోన్న ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల పార్టీలో శెరీయ్యేందుకు సిద్ధమయ్యారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అతి కీలక, ముఖ్యమైన శాఖలను నిర్వహించిన ఆ ఇద్దరు మాజీ మంత్రుల్లో ఒకరు ఫైర్ బ్రాండ్ నేతగా పేరు పొందగా, మరొకరు కాంగ్రెస్‌లో కీలక పదవి నిర్వహించిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ..

షర్మిలతో మాట ముచ్చట

షర్మిలతో మాట ముచ్చట


బలమైన అనుచరగణం ఉన్నప్పటికీ, ఇప్పటికే రెండు పార్టీలు మారి, ఇమేజ్ కాస్త అటు ఇటయి, ఇప్పుడొక మలుపు కోసం ఎదురుచూస్తోన్న ఓ ఫైర్ బ్రాండ్ నేత అలాగే, వైఎస్ హయాంలో కీలక శాఖ, ఆనక కాంగ్రెస్ లో కీలక పదిని సైతం నిర్వహించ మరో మాజీ మంత్రి సీనియరే అయినప్పటికీ, పెద్దగా మాస్ ఫాలోయింగ్ లేని నేత.. ఈ ఇద్దరూ షర్మిలతో కలిసి పనిచేసేందుకు ఒకే చెప్పేశారని, మాట ముచ్చట కూడా దాదాపు అయిపోయిందని,షర్మిల అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఆ మాజీలు ఎవరు? వాళ్ల పేర్లు ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా సాగుతోంది.

చీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీచీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీ

English summary
YS Sharmila expedited the work of the new party to be established in Telangana. She appears to be in talks with senior leaders affiliated with her father Wissar. Two former Telangana ministers are reportedly set to join Sharmila's new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X