వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్‌పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల.. తెలంగాణలో కొత్త రాజకీయయ పార్టీని నెలకొల్పబోతోన్నారంటూ వస్తోన్న వార్తలు.. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. సరికొత్త రాజకీయ సమీకరణాలు, డిబేట్లకు కేంద్ర బిందువు అయ్యాయి. ఆరోొపణలు, విమర్శల మాటెలా ఉన్నప్పటికీ.. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతోన్నారనే సంకేతాన్ని పరోక్షంగా పంపించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Recommended Video

YS Vijayamma, YS Sharmila at Nampally court | Oneindia Telugu

తెలంగాణలో జగన్ వదిలిన బాణం: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైయస్ షర్మిల..?తెలంగాణలో జగన్ వదిలిన బాణం: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైయస్ షర్మిల..?

ఓటుబ్యాంకును ఏకీకృతం చేసేలా..

ఓటుబ్యాంకును ఏకీకృతం చేసేలా..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికంటూ ప్రత్యేకంగా కొంత బలమైన ఓటుబ్యాంకు ఉందని, దాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికే ఆమె సారథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కావొచ్చనే చర్చకు తెర తీశాయా వార్తలు. తెలంగాణలో చెల్లాచెదురుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓటుబ్యాంకును ఏకీకృతం చేయడానికి వైఎస్ షర్మిల పెట్టబోతోన్నారంటోన్న రాజకీయ పార్టీ ఉపయోగపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీ వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సంఘటితమౌతారని అంటున్నారు.

 హిందుత్వాన్ని అణచివేసే కుట్ర

హిందుత్వాన్ని అణచివేసే కుట్ర

దీని మీద ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వర రావు కొన్ని అనుమానాలను లేవనెత్తారు. వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ వెనుక భారీ స్కెచ్ ఉందని ఆయన చెబుతున్నారు. కుట్ర పూరిత రాజకీయాలు, హిందుత్వాన్ని అణచివేసే వ్యూహంతోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతోన్నారని హెచ్చరించారు.

చర్చ్ స్ట్రాటజీతోనే

చర్చ్ స్ట్రాటజీతోనే

వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం.. చర్చ్ ప్రోద్బలం ఉందని నాగేశ్వర రావు అన్నారు. చర్చ్ స్ట్రాటజీతోనే ఆమె పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నారని చెప్పారు. ఈ స్ట్రాటజీ ఏపీలో విజయవంతంగా అమలవుతోందని, అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అదే జరిగితే- రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం ప్రమాదంలో పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని మొదట్లోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రెడ్డి సామాజిక వర్గాన్ని క్రైస్తవులతో అనుసంధానించేలా

రెడ్డి సామాజిక వర్గాన్ని క్రైస్తవులతో అనుసంధానించేలా

తెలంగాణలో బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర కులాలను తన కొత్త రాజకీయ పార్టీ వైపు మళ్లించేలా వైఎస్ షర్మిల కసరత్తు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అధికారాన్ని అందుకోవడానికి రెడ్డి, క్రిస్టియన్ కమ్యూనిటీని విస్తృతంగా వినియోగించుకోవడం, ఇతర హిందూ కులాల మధ్య విభేదాలను సృష్టించాలనేది చర్చ్ స్ట్రాటజీగా కనిపిస్తోందని మన్నెం నాగేశ్వరరావు చెప్పారు. సోనియా గాంధీ సమైక్యాంధ్రను విభజించిన తీరు వెనుక క్రైస్తవ మిషనరీల కుట్ర ఉందనేది తెలిసిన విషయమేనని అన్నారు. ఏపీలో ప్రభుత్వ అధికార శక్తుల సహాయ సహకారాలతో విపరీతంగా జరుగుతున్న మతమార్పిడులను బట్టి తేటతెల్లమౌతుందని, 1999 నవంబర్‌లో పోప్ జాన్ పాల్-2 చెప్పిన క్రైస్తవ భారత్ ప్రణాళికలో ఇదంతా భాగమేనని అన్నారు.

English summary
CBI Former incharge director M Nageswara Rao told that the proposed new political party formation by the YS Sharmila, sister of AP Chief Minister YS Jagan Mohan Reddy, seems part of Church strategy to Christianise Telugu States
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X