వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎన్నికల ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం .. షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : వైఎస్ షర్మిల ప్రచార షెడ్యూల్ ఇదే ! | Oneindia Telugu

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. హోరాహోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి లు. ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసే పనిలో పడింది.

ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం

ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.ఇక ఎన్నికల ప్రచార రంగంలోకి జగనన్న వదిలిన బాణం వైయస్ షర్మిల కూడా దిగనున్నారు. వైసీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు వైసిపి నేతలు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు.ఇక అన్నకు బాసటగా షర్మిల కూడా ప్రచారంలోకి దిగనున్నారు.

జగన్ ప్రచారం చెయ్యని చోట విజయమ్మ , షర్మిల ప్రచారం

జగన్ ప్రచారం చెయ్యని చోట విజయమ్మ , షర్మిల ప్రచారం

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జగన్ ప్రచారానికి వీలుకాని నియోజకవర్గాలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైస్ షర్మిలతో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ ప్రచార షెడ్యూల్ విడుదల చేసిన వైసీపీ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా విడుదల చేసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల కూడా ఈనెల 29 నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

వైఎస్ఆర్ కు నివాళులర్పించి ప్రచారం ప్రారంభం .. షెడ్యూల్ ఇదే

వైఎస్ఆర్ కు నివాళులర్పించి ప్రచారం ప్రారంభం .. షెడ్యూల్ ఇదే

గురువారం తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల పులివెందుల చేరుకోనున్నారు.అక్కడ నుంచి ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చెయ్యనున్నారు. మార్చి 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.మార్చి 29న మంగళగిరి నియోజకవర్గంలోనూ, మార్చి30న గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. మార్చి 31న గంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది.

 మంగళగిరి లో మొదటి ప్రచారం ..నారా లోకేష్ టార్గెట్ గా షర్మిల

మంగళగిరి లో మొదటి ప్రచారం ..నారా లోకేష్ టార్గెట్ గా షర్మిల

మార్చి 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు వై ఎస్ షర్మిల. నారా లోకేష్ టార్గెట్ గా తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ నుండి ఎన్నికల బరిలో ఉన్న తడబాటు మినిస్టర్ నారా లోకేష్ షర్మిల మాటల దాడిని ఎలా ఎదుర్కొంటారో అన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి రసవత్తర రాజకీయ పోరులో షర్మిల ప్రచారంతో ఏపీలో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది.

English summary
YS Sharmila, sister of YSRC chief YS Jagan Mohan Reddy, will join her brother in the election campaign from March 29. She will start her campaign from Mangalagiri, where IT Minister and Nara scion Lokesh is contesting. This is the third time that Sharmila is hitting the road in support of her brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X