కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా ? ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం ! | Oneindia Telugu

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతి పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మ‌ర‌ణించార‌ని భావించారు. అఇయ‌తే, ఆయ‌న త‌ల పై గాయం ఉండ‌టం..బాత్ రూంలో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌టం తో ఆయ‌న మృతి పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో..పోలీసులకు ఫిర్యాదు చేసారు.

<strong>లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!</strong>లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!

వివేకా మృతి పై అనుమానాలు..

వివేకా మృతి పై అనుమానాలు..

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసు లు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు.

ఇంట్లో ఒంట‌రిగా ఉన్నారా..

ఇంట్లో ఒంట‌రిగా ఉన్నారా..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పులివెందుల లో వైయ‌స్ వివేకా గురువారం ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున బాత్‌రూంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పనివారు గుర్తించారు. ఆయ‌న కు తెల్ల వారు జామున వాంతులు అయ్యాయ‌ని..ఆ స‌మ‌యంలో స్నానా ల గ‌దిలోకి వెళ్లి..అక్క‌డే ప‌డిపోయార‌ని తొలుత స‌మాచారం అందించారు.

అనుమానాలు

అనుమానాలు

ఆ త‌రువాత మృత‌దేహం పై ఉన్న గాయాల ను ప‌రీక్షించిన త‌రువాత ఆయ‌న మృతి పై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే ,దీని పై పోలీసులు ప్రాధ‌మిక విచార‌ణ ప్రారంభించారు. ఎన్నిక‌ల వేళ‌..వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌నే అనుమానాలు రాజ‌కీయంగానూ వేడి పుట్టిస్తున్నాయి.

English summary
YS Vivekananda Reddy PA complaint to Police. He expressed doubt in Viveka death. Many injuries found on Viveka's dead body. Police filed complaint started enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X