హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హత్యకేసు..సాక్ష్యాలు తారుమారు వ్యవహారంలో గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనా ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఆయన్ను హత్య చేశారు అనేది మాత్రం తెలియలేదు . తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపిన కేసులో గత ప్రభుత్వం వై ఎస్ వివేకా హత్యకేసు విచారణకు సిట్ ను నియమించినా అది కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు .దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సిట్ ను నియమించి వై ఎస్ వివేకా హత్యకేసును ఛేదించే పనిలో పడింది . ఇక అందులో భాగంగా వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలకు కోర్టు అనుమతించింది .

వాచ్ మ్యాన్ రంగయ్య, శేఖర్ రెడ్డిలకు పూర్తైన నార్కో పరీక్షలు .. గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి
వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ఈ దర్యాప్తులో వాచ్ మ్యాన్ రంగయ్య ను విచారించిన సిట్ అధికారులు రంగయ్య నుండి సరైన సమాధానం రాబట్టలేక కోర్టు అనుమతితో రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయించటానికి హైదరాబాద్ తరలించారు. ఇక వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పాత్రధారి అని భావిస్తున్న కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిని కూడా నార్కోఅనాలసిస్‌ పరీక్షలకు తరలించారు .

YS Viveka murder case : Gangi reddy also undergo a narco-analysis

ఇక తాజాగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి నార్కోఅనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు . ఈ పిటిషన్‌ ఈరోజు విచారణకు వచ్చింది . వాచ్‌మెన్‌ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిలకు నార్కోఅనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతించిన కోర్టు గంగిరెడ్డి విషయంలో కూడా నార్కో పరీక్షలకు అనుమతించింది.

ఏపీ రైల్వే కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ .. ప్రజలు ఆవును కోరితే ఎద్దును ఇస్తారా అని ఫైర్ఏపీ రైల్వే కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ .. ప్రజలు ఆవును కోరితే ఎద్దును ఇస్తారా అని ఫైర్

సాక్ష్యాలను తారుమారు ఆరోపణలపై ఎర్ర గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చెయ్యనున్న సిట్
వైయస్ఆర్సిపి నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సంచలన హత్య కేసులో, హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షను కోర్టు అనుమతించటంతో ఆయన్ను హైదరాబాద్ తరలించనున్నారు . జైలు నుంచి బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డికి కోర్టు నార్కో పరీక్షలను చెయ్యాలనే పోలీసుల అప్పీల్ అంగీకరించింది . ఇక వివేకా ఇంటి కాపలాదారు రంగయ్య, శేఖర్ రెడ్డిలకు ఇప్పటికే నార్కో అనాలిసిస్ పరీక్ష జరిగినట్టు తెలుస్తుంది . ఇంతకు ముందు, నార్కో పరీక్ష నిర్వహించాలన్న సిట్ అభ్యర్థనను పులివెందుల కోర్టు తిరస్కరించింది. అయితే, ఇటీవల, అదే కోర్టు నిందితులకు పరీక్షను అనుమతించింది. వైయస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు పోలీసులు మార్చి 28 న వారిని అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు.

English summary
In the sensational murder case of the YSRCP leader and former minister YS Vivekananda Reddy, the court has permitted the Narco analysis test to Yerra Gangi Reddy on the charges of manipulating the evidence in the murder case. With this, the court has granted the Narco tests to Gangi Reddy who is out on bail from the jail. It's known that already the Narco analysis test was done to Viveka's house watchman Rangiah and Shekhar Reddy. Earlier, the Pulivendula court has refused the SIT's request to conduct the Narco test. However, recently, the same court has permitted the test to the accused. The police have arrested them on 28 March over manipulating the evidence in YS Viveka's murder case, and they were in remand to till now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X