వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హత్య కేసులో కొత్త ప్రచారం: ఖండించిన పోలీసులు: నిందితుల నిర్ధారణ కాలేదని వివరణ..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ఉదయం నుండి ఒక ప్రచారం మొదలైంది. ఆయన్ను ప్రొద్దుటూరు కు చెందిన ఒక గ్యాంగు సుపారీ తీసుకొని మర్దర్ చేసిందంటూ ప్రచారం సాగింది. దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని..అయితే ఆయనకు ఈ డీల్ ఎవరు అప్పగించారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారనేది ఆ ప్రచార సారాంశం. అయితే..పోలీసులు దీనిని ఖండించారు. వివేకా హత్య కేసులో ప్రొద్దుటూరు సుపారీ గ్యాంగ్ ఉన్నట్లుగా తాము ఎక్కడా చెప్పలేదని..ఇటువంటి ప్రచారం చేయటం సరి కాదని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ సాగుతున్న సమయంలో ఈ రకమైన ప్రచారం చేసిన వారు శిక్షార్హులని పోలీసులు హెచ్చరించారు. దీంతో..వివేకా హత్య కేసులో చిక్కు ముడి వీడిందని..ఇక అసలు దోషులను పట్టుకుంటున్నారనే ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు పోలీసులు కేసు చేధించే పనిలో ఉన్నారు.

 వివేకాది సుపారీ హత్య అంటూ ప్రచారం..

వివేకాది సుపారీ హత్య అంటూ ప్రచారం..


గత మార్చిలో జరిగిన మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. పులివెందులో తన నివాసంలో వివేకా హత్యకు గురయ్యారు. దీని పైన రాజకీయంగా అనేక ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ హత్య కేసు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా డీజీపీని ఆదేశించారు. దీంతో..ఆయన స్వయంగా పులివెందులకు వెళ్లి సిట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ కేసులో దాదాపు 800 మందిని సిట్ అధికారులు విచారించారు. అయితే, తాజాగా సిట్ అధికారులు ఒక విషయాన్ని నిర్ధారించారు. అందులో వివేకను హత్య చేసింది సుపారీ గ్యాంగ్ గా గుర్తించారంటూ ప్రచారం సాగింది.. హత్య సమయంలో వినియోగించిన ఒక బైక్ ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ చేయగా ఈ విషయం నిర్ధారణ అయిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సుపారీ ఇచ్చింది ఆయనే అంటూ ప్రచారం..

సుపారీ ఇచ్చింది ఆయనే అంటూ ప్రచారం..


వివేకాను హత్య చేసిని ప్రొద్దుటూరుకు చెందిన ఒక గ్యాంగ్ గా అధికారులు గుర్తించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. హత్య చేసింది ఈ గ్యాంగ్ అనే విషయాన్ని అధికారులు సైతం ఖరారు చేసినట్లు కూడా అందులో పోస్టింగ్ లు దర్శనమించాయి. అయితే, ఈ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన వ్యక్తి పేరును ప్రచారంలోకి తీసుకొచ్చారు. సొంత బాబాయ్ హత్య కేసు ఎవరు చేసారో తేల్చలేకపోయారంటూ ముఖ్యమంత్రి జగన్ మీద ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో సొంత కుటుంబ సభ్యులు సైతం వివేకా హత్య కేసు బాధ్యులను గుర్తించే ప్రక్రియ వేగ వంతం చేయాలని కోరారు. దీంతో..ముఖ్యమంత్రి స్వయంగా పులివెందుల పర్యటనలోనే డీజీపీని ఈ కేసును తేల్చాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల జోక్యంతో సిట్ అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తోంది.

ప్రచారాన్ని ఖండించిన పోలీసులు

ప్రచారాన్ని ఖండించిన పోలీసులు


అయితే, కేసు విచారిస్తున్న కడప జిల్లా పోలీసులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. కేసు విచారణలో ఉన్న సమయంలో ఇటువంటి ప్రచారం విచారణ మీద ప్రభావం చూపుతుందని పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంకా దోషులను నిర్ధారించే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇటువంటి ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కడప జిల్లా పోలీసులు హెచ్చరించారు.

English summary
new twist in YS viveka murder. SIT traced this as supari murder by Proddutur sunil gang. Srinivasa reddy who died suspiciously in last month was settle deal for this murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X