వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందులలో సీబీఐ కీలక సోదాలు.. వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదలాయించగా, మూడు నెలలు ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభమైంది. శనివారం కడపలో అడుగుపెట్టిన సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వివేకా హత్య కేసు వివరాలను అడిగితెలుసుకున్నారు. దర్యాప్తులో రెండోరోజైన ఆదివారం వైఎస్ స్వస్థలమైన పులివెందులకు వెళ్లారు.

Recommended Video

YS Vivekananda Reddy Case CBI Investigation Started వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..!!

వివేకా హత్యకు గురైన పులివెందులలోని ఇంటిని సీబీఐ అధికారులు ఆదివారం పరిశీలించారు. అక్కడ కీలక సోదాలు నిర్వహించిన అనంతరం.. సీబీఐ బృందం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. సీబీఐ బృందం రాకపై స్థానిక పోలీసులకు ముందే సమాచారం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వివేహా హత్య కేసును ఇదివరకే స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిఉన్న నేపథ్యంలో సీబీఐ అంశాలవారిగా దానిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

ys vivekananda reddy murder case: cbi officials search at pulivendula house

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, వైఎస్ కుటుంబంలో ముఖ్యుడైన వైఎస్ వివేకానంద రెడ్డి గత ఏడాది మార్చి 15న పులివెందులలోని తన సొంతింట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించినా, అసలైన నిందితులు ఎవరేది మాత్రం తేల్చలేదు. ఏపీ సర్కారు దర్యాప్తు చేయిస్తోన్న తీరుపై వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.

English summary
The Central Bureau of Investigation (CBI) started an investigation into the killing of Chief Minister Y S Jagan Mohan Reddy's uncle and former minister and MP Y S Vivekananda Reddy. on sunday cbi officials searched at viveka's house in pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X