వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్‌: కూతురు సునీత చెప్పిన పేర్లు ఇవే, ఏపీ సర్కారుకు కోర్టు సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో కొత్త ట్విస్ట్‌ వెలుగుచూసింది. తన తండ్రి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు.

వైఎస్ వివేక కూతురు చెప్పిన పేరు ఇవే..

వైఎస్ వివేక కూతురు చెప్పిన పేరు ఇవే..

ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడంలేదంటూనే తమకు అనుమానాలున్నాయంటూ కొందరి పేర్ల జాబితా హైకోర్టుకు ఆమె సమర్పించడం గమనార్హం.

సునీత పేర్కొన్న జాబితాలో ఉన్న పేర్లు:-
వాచ్‌మన్‌ రంగయ్య
ఎర్ర గంగిరెడ్డి
వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి
పరమేశ్వర్‌రెడ్డి
శ్రీనివాసరెడ్డి
వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి
వైఎస్‌ మనోహర్‌రెడ్డి
వైఎస్‌ అవినాష్‌రెడ్డి
సీఐ శంకరయ్య
ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి
ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
ఘటనాస్థలంలో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తమకు కొందరిపై అనుమానాలున్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు.

సీబీఐకి అప్పగించడంలో అభ్యంతరమేంటీ? ఏపీ సర్కారుకు హైకోర్టు

సీబీఐకి అప్పగించడంలో అభ్యంతరమేంటీ? ఏపీ సర్కారుకు హైకోర్టు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం విదితమే. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు వేసిన వారిలో ప్రస్తుత సీఎం జగన్ కూడా ఒకరని.. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఇచ్చేందుకు ఉన్న అభ్యంతరమేంటని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఏజీ అందుబాటులో లేరని వివరాల సమర్పణకు ప్రభుత్వ లాయర్‌ గడువు కోరారు. అనంతరం తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

దర్యాప్తు కొలిక్కి రావడం లేదంటూ హైకోర్టుకు సునీత

దర్యాప్తు కొలిక్కి రావడం లేదంటూ హైకోర్టుకు సునీత

కాగా, గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయాన్ని కూడా సునీత మరోసారి గుర్తుచేశారు. గవర్నర్‌ను కలిసి కూడా విజ్ఞప్తి చేశామని ఆమె వెల్లడించారు. కేసు దర్యాప్తు సరిగా జరగడంలేదని.. తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపీ పోలీసులపై నమ్మకంలేదని అప్పట్లో చెప్పి.. ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరపడం ఎంతవరకు సమజసం? అని.. 3 సిట్‌ టీమ్‌లు ఏర్పాటు చేసినా దర్యాప్తు కొలిక్కి రావడంలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాజ్యాలన్నీ మిగితా వాటితో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
YS Viveka's murder case takes a new twist as High Court to hear all petitions seeking CBI probe on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X