హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్యూలో ఊహించని ప్రశ్న: ఎమ్మెల్యే రోజాకు దిమ్మదిరిగింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించిన ఓ ఇంటర్యూ ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మెరుగైన సమాజం కోసం అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్న టీవీ9 యాంకర్ బరితెగించి అడిన ప్రశ్నను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.... టీవీ9 యాంకర్ ఒకరు ఇటీవలే రోజాను ఇంటర్వ్యూ చేశారు. వాస్తవానికి టీవీ9 ప్రతినిధి ఇంటర్యూ చేసే సమయంలో అడిగే ప్రశ్నలు కొంత మేరకు లోబడి ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం ఒక మహిళను అలాంటి ప్రశ్న అడగవచ్చా? లేదా అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రోజాను నీచమైన ప్రశ్న అడిగాడు.

మీరు బ్లూఫిల్మ్‌లో నటించారా? లేదా చెప్పడంటూ సిగ్గులేకుండా అడిగారు. సిగ్గులేకుండా ఇలాంటి ప్రశ్నను అడగడమే కాకుండా తిరిగి అదే ప్రశ్నను ప్రోమోలో వాడుకోవడాన్ని చూసిన జనాలు మాత్రం సిగ్గుపడుతున్నారు.

రోజాను ఇంటర్యూ చేసిన సదరు ఆ జర్నలిస్టు ప్రజాప్రతినిధులతో పాటు స్టూడియోకు గెస్టులుగా వచ్చే వారిని ఇంటర్వ్యూలో ఇలా ఎక్స్‌ట్రాలు చేయడం సర్వసాధారణంగా మారిందన్న అభిప్రాయం మీడియాలో ఉంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒకింత ఆగ్రహాంతో ఉన్నారు.

 roja

ఇంటర్యూలో ఎమ్మెల్యే రోజా తీరుని తప్పుబడుతున్నారు. అంతటి చండాలమైన ప్రశ్న అడిగిని టీవీ 9 ప్రతినిధి ఆ ప్రశ్న అడిగిన వెంటనే చెప్పుతో కొట్టి వచ్చిఉంటే గర్వపడేవారిమని అంటున్నారు. లేదా మీ ఇంట్లోని మహిళలు కూడా ఇలాగే నీలిచిత్రాల్లో నటించారేమో వెళ్లి అడుగు అని ఎదురు ప్రశ్నించి ఉంటే బాగుండేదని అంటున్నారు.

జర్నలిజంలో విలువలు దిగజారాయనేది ఇలాంటి ఘటనలు చూస్తేనే తెలుస్తోందని అంటున్నారు. అయితే సదరు టీవీ9 ప్రతినిధి అడిగిన ప్రశ్నపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ప్రతికూల స్పందన రావడంతో ఛానల్ యాజమాన్యం ఆ ప్రోమోను ఇంటర్నెట్ నుంచి తీసివేసింది.

English summary
yscrp followers express anger over roja by tv9 anchor misbehaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X