వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇంటర్వ్యూతో సంబంధం లేదు: జగన్

బెయిల్ రద్దు చేయాలంటూ సిబీఐ దాఖలు చేసిన ఇంటర్వ్యూతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ శుక్రవారంనాడు సిబీఐ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బెయిల్ రద్దు చేయాలంటూ సిబీఐ దాఖలు చేసిన ఇంటర్వ్యూతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ శుక్రవారంనాడు సిబీఐ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

విచారణను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరించారంటూ ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టులో సిబిఐ పిటిషన్ ను దాఖలు చేసింది.

ఈ పిటిషన్ కు శుక్రవారం నాడు జగన్ కౌంటర్ ను దాఖలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ys jagan

పత్రికా స్వేఛ్ఛకు అనుగుణంగానే ఇంటర్వ్యూను తీసుకొన్నట్టు చెప్పారు. ఎక్కడా కూడ ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదని చెప్పారు. తనమ క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటపూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు.

దర్యాప్తును ఏ రకంగాను ప్రభావితం చేయలేదని కోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్ లో జగన్ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు.సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను వెంటనే డిస్ మిస్ చేయాలని కోరారు.ఈ కేసు విచారణ ఈ నెల 21వ, తేదికి వాయిదా పడింది.

English summary
ysjagan mohanreddy counter petition filed against cbi on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X