వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

అమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు విపక్షలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో రైతులు గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే‌లు మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని పరిధిలోని కృష్ణా, గుంటురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సమావేశం అయ్యారు.

 నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..! నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!

డ్యామెజీ కంట్రోల్‌లు అధికార ఎమ్మెల్యేల కసరత్తు

డ్యామెజీ కంట్రోల్‌లు అధికార ఎమ్మెల్యేల కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి తరలింపుతో ఏపీలో రాజకీయాలు వెడెక్కిన విషయం తెలిసిందే... ముఖ్యంగా రాజధాని తరలింపుపై సీఎం జగన్ ప్రకటన రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజల్లో సంతోషాన్ని నింపుతుండగా... అమరావతిలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయితే అమరావతిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది కొంత మింగుడుపడని పరిస్థితి. రైతుల ఆందోళనలు చేస్తుంటే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా , అటు పార్టీ పరంగా డ్యామెజ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులు తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఫిర్యాదు కూడ చేశారు. దీంతో డ్యామేజి కంట్రోల్ చేసేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు , నేతలు సమావేశం అయ్యారు.

 ఆందోళన ఉదృతం చేసిన రైతులు

ఆందోళన ఉదృతం చేసిన రైతులు

ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు తమ భూములపై అందోళన చేస్తున్నారు. అభివృద్ది పేరుతో భూములు తీసుకున్నారని , ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలం వద్ద నిరసనలకు దిగారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు శుక్రవారం క్యాబినెట్ జరగనున్న నేపథ్యంలోనే ర్యాలిని తలపెట్టారు. రాజధాని కోసం ఇచ్చిన భూములు ఎటు పనికి రాకుండా పొతున్నాయని వారు ఆందోళన చేస్తున్నారు.

విపక్షాల విమర్శలు

విపక్షాల విమర్శలు

ముఖ్యంగా రైతులతో పాటు టీడీపీ , బీజేపీ , జనసేనలు తీవ్రంగా వ్యతికేసిస్తూ... ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సైతం రాజధానిలో దీక్షకు దిగనున్నారు. దీంతో సమావేశంలో ఆందోళన చేస్తున్న రైతులకు భరోసా ఇవ్వడం తోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశాన్ని చర్చించనున్నారు.

రైతుల వద్ద భూమిని బలవంతగా లాక్కుకున్నారు...

రైతుల వద్ద భూమిని బలవంతగా లాక్కుకున్నారు...

ఇక రాజధాని కోసం కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారని, మరికొంతమంది వద్ద ప్రభుత్వం బలవంతంగా లాక్కున్నారని, ఇంకొందరు కోర్టుకు కూడ వెళ్లారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ సంధర్భంగా అన్నారు. దీంతో వారికి ఎలాంటీ ఇబ్బంది కల్గకుండా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల ప్రకారమే వారి భూములను అభివృద్ది చేసి ఇస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. మరోవైపు సీఆర్డీఏ భూములు వ్యవహారం , రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని కూడ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

English summary
YSR Congress Party leaders MLAs and ministers counduct a meeting in Amravati They discuss about farmers agitaion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X