నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ ఆ దూకుడు ఇప్పుడు లేదా: జగన్‌కు షాక్ తప్పదా, ఏమౌతోంది?

గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత ఆయా జిల్లాల నుంచి పలువురు టిడిపిలో చేరార

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత ఆయా జిల్లాల నుంచి పలువురు టిడిపిలో చేరారు.

చదవండి: జగన్ పార్టీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నారా?

వైసిపి గెలుచుకున్న ఆ జిల్లాలపై టిడిపి ప్రత్యక దృష్టి సారించింది. దీంతో జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పరిస్థితి కూడా జగన్‌కు ఇబ్బందికరంగా మారేలా ఉందని అంటున్నారు.

మొదటి నుంచి జగన్ వెంట.. ఆ దూకుడు లేదా?

మొదటి నుంచి జగన్ వెంట.. ఆ దూకుడు లేదా?

గత ఎన్నికల్లో నెల్లూరులోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడింటిని వైసిపి గెలుచుకుంది. మేకపాటి కుటుంబం, నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి వంటి నేతలు జగన్ వెంట మొదటి నుంచి నడుస్తున్నారు.

అయితే ఆరంభంలో ఉన్న చురుకుదనం ఇప్పుడు లేదంటున్నారు. జగన్ తన ఆలోచలను, సూచనలను పట్టించుకోకపోవడం వల్ల మేకపాటి ఒకింత మౌనంగా ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నల్లపురెడ్డి దూకుడు కూడా కనిపించడం లేదంటున్నారు.

వీరే..

వీరే..

ఇక, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారే మీడియా ఎదుట కనిపిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా కనిపిస్తున్నారు. గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు.

జగన్ తీరుపై విమర్శలు

జగన్ తీరుపై విమర్శలు

వైసిపి అధినేత జగన్ తీరుపై సొంత పార్టీలోనే చర్చనీయాంశం అయిందని అంటున్నారు. నిత్యం నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడంపై వైసిపిలోనే సెటైర్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.

వాటిపై అసంతృప్తి

వాటిపై అసంతృప్తి

విశాఖలో కాబోయే ముఖ్యమంత్రిని అంటూ జగన్ చెప్పిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాద ఘటన సమయంలోను కలెక్టర్ పట్ల జగన్ తీరుపై టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు.

గడువు రెండేళ్లు..

గడువు రెండేళ్లు..

ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. 2014 ఎన్నికల సమయంలో జగన్, విజయమ్మ, షర్మిలలు వచ్చి ప్రచారం చేశారు. రైతుల సమస్యలు, నీటి సమస్యలు తీరుస్తామని చెప్పారు. జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం వైఫల్యాలపై వైసిపి సరిగా పోరాడటం లేదని ఆవేదన ప్రజల్లో ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసిపి పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది.

English summary
Yuvajana Sramika Rythu Congress Party in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X