గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిషికేశ్వరి మృతిపై రెండో విచారణ: భారీ భద్రత, వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టించిన రిషికేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసేందుకు ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజనిర్ధారణ కమిటీ యూనివర్సిటీలో పర్యటించింది.

రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వారందరిపై కేసు నమోదు చేసి, శిక్షించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. గత నెల 14న యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శని హాస్టల్‌లో బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషికేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

రిషికేశ్వరి కేసును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ కేసులో పోలీస్‌ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం నుంచి రెండో దఫా విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

జులై 29 నుంచి 31 వరకు బాలసుబ్రహ్మణ్యం కమిటీ తొలి దఫా విచారణ చేపట్టనున్నారు. నేపథ్యంలో బుధవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు కూడ ఆందోళన ఉధృతం చేసే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు.

తొలి దఫాలో ఈ కమిటీ పోలీస్, రెవెన్యూ వర్సిటీ ఉన్నతాధికారులు, విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు, అధ్యాపకులు, వసతి గృహ వార్డెన్‌లు, ఇతర సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది.

రిషికేశ్వరి మృతిపై రెండో విచారణ: భారీ భద్రత, వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

పది రోజుల
సెలవుల అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం బుధవారం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై ఆర్కిటెక్చర్ విద్యార్ధులందర్నీ ప్రశ్నించారు. విద్యార్ధుల వద్ద ఉన్న సమాచారాన్ని ఈమెయిల్స్ ద్వారా కమిటీకి నివేదించాలని సూచించారు.

వర్సిటీలో ర్యాగింగ్‌తో పాటు సీనియర్లు లైంగిక వేధింపులకు, వికృత చేష్టలకు పాల్పడినట్లు ఇప్పటికే పోలీస్‌ అధికారులు నిర్థారించారు. ఈ కేసులో మరో ఇద్దరు సీనియర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారిని కూడా అరెస్ట్‌ చేయనున్నారు. కాగా.. రిషితేశ్వరిని ఆమె సీనియర్లు గదిలో అర్ధనగ్నంగా తిప్పుతూ ఫొటోలు తీశారనే వచ్చిన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన సూత్రధారి ప్రిన్సిపాల్ బాబూరావే అంటూ విద్యార్ధి సంఘాల నేతలు, ఆర్కిటెక్చర్ విద్యార్ధులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్దులతో కలసి నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో ఉన్న హాయ్‌లాండ్‌లో డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రిన్సిపాల్‌ బాబూరావు కొద్ది నెలల క్రితం హాయ్‌లాండ్‌లో ఫ్రెషర్స్ డే పార్టీకి ఆర్కిటెక్చర్‌కు చెందిన ఇతర ప్రొఫెసర్లు ఎవరూ హాజరుకాలేదు. ప్రిన్సిపాల్ బాబూరావు యూనివర్సిటీ ఆడిటోరియంలో కాకుండా ఇలా బయట పార్టీ ఏర్పాటు చేయడం వెనుకు ఆయనకున్న ఆసక్తి ఏంటీ అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Ysr Congress party visit today nagarjuna university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X