వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ప్రశాంత్‌కిషోర్: వైసీపీ నేతల్లో ఆందోళన, సంస్థాగతంగా బలపడేనా?

వైసీపీలో ఇక ప్రశాంత్‌కిషోర్ మార్క్ కన్పించనుంది. పార్టీకి అవసరమైన వారిని ఎంపికచేసుకొనే పనిలో ఆ పార్టీ ఉంది. ఈ మేరకు సంస్థాగతంగా మార్పులు చేర్పులను ఆ పార్టీ చేసుకోవాలని భావిస్తోంది. అయితే ప్రశాంత్‌కిషో

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: వైసీపీలో ఇక ప్రశాంత్‌కిషోర్ మార్క్ కన్పించనుంది. పార్టీకి అవసరమైన వారిని ఎంపికచేసుకొనే పనిలో ఆ పార్టీ ఉంది. ఈ మేరకు సంస్థాగతంగా మార్పులు చేర్పులను ఆ పార్టీ చేసుకోవాలని భావిస్తోంది. అయితే ప్రశాంత్‌కిషోర్ వల్ల ఎవరికి ఇబ్బందులు ఎదురౌతాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది.

హైద్రాబాద్‌లో ఇటీవల పార్టీ ముఖ్యుల సమావేశంలో ప్రశాంత్‌కిషోర్‌ను జగన్ పరిచయం చేశారు. రానున్న ఎన్నికల కోసం వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, టిడిపి పరిస్థితి ఏమిటనే విషయాలను ప్రశాంత్‌కిషోర్ నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ చీఫ్ జగన్ సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయనున్నారు.

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు పాదయాత్రతోపాటు ఎన్నికల హమీలను కూడ జగన్ కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చే హమీలను ముందుగానే ఆయన ప్లీనరీలో ప్రకటించారు.

సంస్థాగతంగా మార్పులకు అవకాశం

సంస్థాగతంగా మార్పులకు అవకాశం

ప్రశాంత్‌కిషోర్ వ్యూహం ప్రకారంగా వైసీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. కన్వీసర్లహోదాలో మార్పులు చేర్పులు ఖాయమనే నియోజకవర్గాల్లో నెలకొంది. తమ స్థానం పదిలంగా ఉంటుందా? లేదా అనేది తెలుసుకోవడానికి కన్వీనర్లు ఎక్కవ సమయాన్ని కేటాయిస్తున్నారు.అయితే రానున్నరోజుల్లో పార్టీ అధినేత జగన్ ప్రశాంత్‌కిషోర్ సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసుకొనే అవకాశాలు లేకపోలేదు.

అందరి స్థానాలు పదిలమేనా?

అందరి స్థానాలు పదిలమేనా?

2014 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరికీ 2019 ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కేనా అనే అనుమానం పార్టీ నేతల్లో ఉంది. అయితే కొందరు నాయకులు టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ధీమాగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు తమకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొని తిరిగేవారు మరికొందరు కానీ ఈ మధ్యనే జిల్లా అధ్యక్షుల సమావేశంలో రాజకీయ వ్యవహరాల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ సమక్షంలోనే గెలవగలిగిన వారికే టిక్కెట్టు అంటూ ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుచోట్ల మార్పులు

పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుచోట్ల మార్పులు

పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల నియోజకవర్గ కన్వీనర్ల మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ప్రశాంత్‌కిషోర్ నివేదికల ప్రకారంగానే పార్టీ నాయకత్వం చర్యలను తీసుకొనే అవకాశం ఉంది. పార్టీ బాధ్యతలు ఇక భవిష్యత్తులో ఉంటాయన్న సమాచారం సహజంగానే కన్వీనర్లకు ఇబ్బందిపుట్టిస్తోంది.ఐదారుగురు కన్వీనర్లను సాగనంపే ప్రక్రియ ఏదో ఒకరోజు ఆరంభమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.

సంస్థాగతంగా బలపడేనా

సంస్థాగతంగా బలపడేనా

ప్రశాంత్‌కిషోర్ కారణంగా వైసీపీ రాజకీయంగా బలపడేనా సంస్థాగతంగా ఇంకా ఏమైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా అనే చర్చలు కూడ లేకపోలేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయలోపం తదితర కారణాలు కూడ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్తల మీద పార్టీ ఆధారపడితే మరి క్షేత్రస్థాయిలో పార్టీని నడిపేదేవరు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేదేవరు అనే ప్రశ్నలు వైసీపీలో తలెత్తుతున్నాయి. అయితే కొందరునేతలు ఇష్టారీతిలో వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనావేసి బలోపేతం చేసేందుకుగాను ప్రశాంత్‌కిషోర్ చేసే సూచనలు పార్టీకి ఉపయోగపడనున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.అయితే ఈ సలహాలు ఏ నాయకుడికి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే ఆందోళన కూడ లేకపోలేదు.

English summary
Prashanth Kishor is expected to give inputs to YSRC on strengthening the party organisation besides preparing strategies to take on the ruling TDP headed by Chief Minister N Chandrababu Naidu.Having failed to gain power in AP in the 2014 elections soon after the bifurcation of undivided AP, the YSR Congress is determined to wrest power in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X