వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YSR Jalakala Scheme:రైతన్న కోసం ఏపీ ప్రభుత్వం మరో పథకం: అర్హతలు ఇవే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. పాదయాత్రలో అప్పటి ప్రతిపక్షనాయకుడిగా అధికారంలోకి వస్తే ఏవైతే హామీలు ఇచ్చారో... ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దిశగా సీఎం జగన్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని చాలా వరకు పథకాలను అమలు చేయగా తాజాగా సోమవారం రోజున మరో పథకం ప్రారంభించనున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. రైతులకు అండగా నిలవాలని కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

రైతుల కోసం ఉచితంగా బోరుబావులు

రైతుల కోసం ఉచితంగా బోరుబావులు

రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. నవరత్నాల్లో భాగంగా రైతులకు ఉచితంగా బోరుబావిలను తవ్విస్తామన్న హామీని జగన్ నెరవేర్చబోతున్నారు. వైయస్సార్ జలకళ పేరుతో ఈ బోరుబావులను ప్రభుత్వం తవ్వించనుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ సెప్టెంబర్ 28వ తేదీన తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంను ప్రారంభించనున్నారు.అయితే పథకంకు ఎవరు అర్హులు, అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నదానిపై కూడా విధి విధానాలను విడుదల చేయడం జరిగింది.

అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?

అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?

వైయస్సార్ జలకళ పథకంకు అర్హులైన రైతులు ముందుగా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాము ఉంటున్న గ్రామంలోని గ్రామ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ముందుగా వీఆర్వో పరిశీలనకు వెళుతుంది. ఆ తర్వాత డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆ అప్లికేషన్‌ను జియాలజిస్టు దగ్గరకు పంపుతారు. రైతు భూమిలో నీరు పరిస్థితి ఎలా ఉందో సర్వే చేస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే బోరు బావి తవ్వేందుకు అన్ని సాంకేతిక అనుమతులు ఇస్తారు. ఆ తర్వాత బోరుబావి తవ్వేందుకు కాంట్రాక్టర్‌కు బాధ్యత అప్పగిస్తారు. నీళ్లు పడితే దాన్ని బట్టి కాంట్రాక్టరుకు బిల్లును చెల్లిస్తారు.

 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉండాలి

2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉండాలి


ఇక నిబంధనల ప్రకారం రైతుకు కనీసం 2.5 ఎకరాలు నుంచి 5 ఎకరాలు భూమి ఉండాలి. లేదంటే తమ పక్క పొలంలో ఉన్న రైతుతో కలిసి బోరుబావి కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఏ భూమికైతే బోరుబావి వేయించాలని రైతు భావిస్తున్నాడో ... ఆ భూమిపై అంతకుముందు బోరుబావి ఉండి ఉండకూడదనే నిబంధన ప్రభుత్వం పెట్టింది. ఈ జలకళ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఇక ఏరోజైతే బోరుబావి తవ్వడం మొదలు పెడుతారో అప్పుడే రైతు ఫోనుకు ఎంఎసంఎస్ రూపంలో మెసేజ్ వెళుతుంది. ఒక వేళ తొలి ప్రయత్నంలో నీరు పడకుంటే తిరిగి నిపుణుడైన జియాలజిస్ట్ సూచనల మేరకు రెండో సారి కూడా బోరుబావిని తవ్వుతారు.

English summary
AP govt is all set to launch another scheme YSR Jalakala that benifits the farmers intended to provide free borewells to farmers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X