వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలి: స్పీకర్‌తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శానససభ లాంజ్‌లో తొలగించిన వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తిరిగి అక్కడే పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు శుక్రవారం స్పీకర్‌ను కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైయస్ ఫొటోను ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారని కూడా వారు స్పీకర్‌ను అడిగారు. ఫొటో తొలగించే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని, కచ్చితంగా వైయస్ ఫొటోను ఎక్కడి నుంచి తొలగించారో అక్కడే పెట్టాలని వారన్నారు.

YSR photo should be there: YSR Congress

అయితే, ఆధునీకీకరణ కోసం వైఎస్ ఫోటోతో పాటు సంజీవయ్య ఫొటను కూడా తొలగించినట్లు స్పీకర్ చెప్పారని అంటున్నారు. వైఎస్ ఫొటో తొలగించినందుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు గత నెల 31వ తేదీన శాసనసభా కార్యదర్శి కె. సత్యనారాయణ రావు ఛేంబర్ వద్ద ధఱ్నా చేశారు.

రెండు రోజుల్లో వైఎస్ ఫొటోను తిరిగి ఉంచుతామని సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు. కానీ గుడువు ముగిసినా హామీని నిలబెట్టుకోలేదని, ఈ నెల 11వ తేదీన స్పీకర్ అధ్యక్షతన జరిగన కమిటీ ఆన్ జనరల్ పర్ససెస్ సమావేశంలో వైయస్ ఫొటో ఏర్పాటుపై ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు. వైఎస్ ఫొటోను తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు.

English summary
YSR Congress party MLAs appealed to the Andhra Pradesh speaker Kodela Sivaprasad Rao to place YS Rajasekhar Reddy' photo in Assembly premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X