వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపేస్తారేమో..: రోడ్డుపై రోజా పరుగులు, అరెస్ట్ వెనుక కారణం ఇదీ.. (పిక్చర్స్)

ఏపీలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా హాజరు కాకుండా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. దీంతో రోజా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది పెద

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా హాజరు కాకుండా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. దీంతో రోజా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది పెద్ద చర్చకు దారి తీసింది.

అయితే, రోజాను అడ్డుకోవడానికి కారణం ఫేస్‌బుక్ పోస్ట్ కారణమని తెలుస్తోంది. జాతీయ మహిళా పార్లమెంటుకు రోజా వస్తున్నట్లు మొదట పోలీసులకూ సమాచారం లేదు. సదస్సు ప్రారంభానికి ముందు రోజు ఇంటెలిజెన్స్‌ అధికారి వాట్సా్‌పకు కిందిస్థాయి సిబ్బంది నుంచి ఓ ఫొటో వచ్చింది.

కోడెల కోడలు చెబుతుంది: రోజా, వెంకయ్య కూతురు. బ్రాహ్మణిలపై వ్యాఖ్యలుకోడెల కోడలు చెబుతుంది: రోజా, వెంకయ్య కూతురు. బ్రాహ్మణిలపై వ్యాఖ్యలు

అందులో.. మహిళా ఎమ్మెల్యేని అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టిన వాళ్లు మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడమా..? సిగ్గు.. సిగ్గు.. అని ఉందట. దీంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్‌ వర్గాలు దీనిపై దృష్టి పెట్టి, మహిళా పార్లమెంటులో రోజా గొడవ చేస్తారన్న విషయాన్ని నిర్ధారించుకున్నారు.

నాటకీయ పరిణామాలు

నాటకీయ పరిణామాలు

జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో గొడవ సృష్టిస్తారన్న సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు కొద్దిసేపు నిర్బంధించిన విషయం తెలిసిందే. శనివారం గన్నవరం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని అనంతరం హైదరాబాద్‌ తరలించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.

విమానాశ్రయంలో హడావుడి

విమానాశ్రయంలో హడావుడి

శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ట్రూజెట్‌ విమానంలో వచ్చిన రోజా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. టెర్మినల్‌లోకి వచ్చిన రోజాను కలిసిన పోలీసులు, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉందని కొద్దిసేపు లాంజ్‌ రూంలో కూర్చోవాలని కోరారు. పోలీసులు తనను అడ్డుకోవడానికి చూస్తున్నారని భావించిన రోజా విమానాశ్రయంలో హడావిడి సృష్టించేందుకు ప్రయత్నించారు. తనతో పాటు వచ్చిన వారిని జరుగుతున్నదంతా వీడియో తీయాలని పురమాయించారు.

వీడియో తీసి చానళ్లకు..

వీడియో తీసి చానళ్లకు..

వీడియో ఫు టేజిని పార్టీ అధ్యక్షుడు జగన్‌కి, టీవీ చానళ్లకు పంపే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. తర్వాత రోజాను కారులోకి ఎక్కించుకొని టెర్మినల్‌ వెనుక నుంచి పాత టెర్మినల్‌ వైపు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విజయవాడ వెళుతుండగా కేసరపల్లి దగ్గర ట్రాఫిక్‌జాం కావడంతో కంకిపాడు మీదుగా విజయవాడ తీసుకొచ్చారు.

రోడ్డుపై పరుగులు.. హైదరాబాద్ తరలింపు

రోడ్డుపై పరుగులు.. హైదరాబాద్ తరలింపు

విజయవాడ వచ్చే దారిలో ఓ చోట స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద కారు స్లో అవడంతో రోజా కారు నుంచి కిందకు దూకేశారు. అక్కడున్న జనాలను చూసి సినీ ఫక్కీలో కాపాడండి.. కాపాడండి.. అంటూ రోడ్డుపై పరుగు పెట్టారు. వెంటనే తేరుకున్న మహిళా పోలీసులు ఆమెను తిరిగి కారులో ఎక్కించుకొని తొలుత విజయవాడ అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

వాట్సాప్ వీడియో

వాట్సాప్ వీడియో

పోలీసులు కారులో తనను తరలిస్తున్న సమయంలోనే రోజా తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌లో పార్టీ అధినేత వైయస్ జగన్‌కు పంపారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేశారు.

నన్ను చంపేస్తారేమో..

నన్ను చంపేస్తారేమో..

టిడిపి ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనను చంపేయరని గ్యారెంటీ లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం రాత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తనను జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానించి, ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపించారు.

రోజా ఉద్వేగం

రోజా ఉద్వేగం

తనను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నేరాల పెరుగుతున్న విజయవాడలో..

నేరాల పెరుగుతున్న విజయవాడలో..

నేరాలు పెరుగుతున్న విజయవాడలో సదస్సు పెట్టారని, అక్కడకు తాను వెళ్తే ఉగ్రవాదిలా నిర్బంధించారని, ఇది ప్రజల డబ్బుతో నిర్వహిస్తున్న సదస్సు అని, ప్రజాప్రతినిధిగా పాల్గొనే హక్కు తనకు ఉందని రోజా అన్నారు.

దుమ్మెత్తిపోసిన భారత్

దుమ్మెత్తిపోసిన భారత్

చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గం ఎలా ఉందో తనను అడ్డుకోవడం ద్వారా అర్థమవుతోందని రోజా అన్నారు. చంద్రబాబుకు, స్పీకర్‌కు తాను అంటే అంత భయం ఎందుకని, ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ ఉంటుందని, దీనికి భయపడి మహిళలను అడ్డుకుంటారా అని రోజా నిలదీశారు.

English summary
Controversial Andhra Pradesh MLA and former film star Roja was back in the eye of a storm as she was detained at the Gannavaram airport in Vijayawada after she arrived to attend the National Women's Parliament in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X