కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీటు బెల్ట్ పెట్టనందునే!: శోభ కారు ప్రమాదం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కర్నూలు: రోడ్డు ప్రమాదంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీ నాయకురాలు షర్మిల సభలో పాల్గొన్న శోభా కారులో వెళ్తుండగా.. రోడ్డు పైన ధాన్యం రాశులు అడ్డు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు షర్మిల జనభేరీ సభలో పాల్గొనేందుకు శోభా నాగిరెడ్డి నంద్యాలకు వచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు జనభేరి సభ ముగిసింది. భోజనం చేసిన అనంతరం రాత్రి పదిన్నర గంటలకు ఆమె కారులో బయలుదేరారు. ఆమె ముందు సీటులో కూర్చున్నారు. వెనుక ఇద్దరు గన్‌మెన్లు కూర్చున్నారు.

కారు వెంట రెండు ఎస్కార్టు వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఏడుగురు ఉన్నారు. ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలోని మిట్ట వద్ద రోడ్డు పైన ధాన్యం కుప్పలు ఆరబోసి ఉన్నాయి. పూర్తిగా దగ్గరకు వచ్చాక అవి కనిపించడంతో... డ్రైవర్ కారును ఎడమ వైపుకు తిప్పబోయాడు. దీంతో వాహనం నాలుగు ఫల్టీలు కొట్టింది.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

వాహనం ఫల్టీ కొట్టడంతో రోడ్డుకు వంద మీటర్ల దూరం వరకు పోయింది. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంది.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి సీటు బెల్టు పెట్టుకోలేదు. దీంతో ఆమె అద్దంలో నుండి ఎగిరి కిందపడ్డారు. ఈ కారణంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

ప్రమాదాన్ని గుర్తించిన వెనుక వాహనంలోని వారు... ఆమెను వెంటనే ఆళ్లగడ్డలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఎస్కార్ట్ వాహనాలు దూరంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన పది నిమిషాలకు అవి వచ్చాయి.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆమెను నంద్యాలలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు గంటల పాటు వైద్యం అందించిన వైద్యులు.. హైదరాబాదుకు తరలించారు. ఆమె గురువారం ఉదయం మృతి చెందినట్లు కేర్ వైద్యులు చెప్పారు.

English summary
YSR Congress party candidate Shobha Nagi Reddy, who was seeking a re-election from Allagadda constituency in Andhra Pradesh in the upcoming assembly polls, succumbed to her injuries on Thursday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X