వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Fools People name of MPs resignation

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళనలు చేస్తారని, ఏప్రిల్ 6వ తేదీ లోపు కేంద్రం దిగి రాకుంటే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: జేసీకి బొత్స దిమ్మతిరిగే కౌంటర్, మేం సిద్ధం కానీ పవన్ కళ్యాణే తేల్చుకోవాలి

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో తాము రాజీనామా చేస్తామని వైసీపీ చెబుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదంతా డ్రామా అని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు, జగన్ పక్కా ప్లాన్‌తోనే ఈ ప్రకటన చేశారని, రాజీనామాలు చేసినా నష్టం లేదనే ఉద్దేశ్యంతోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

చదవండి: జగన్! ఆ క్షణమే రాజీనామా చేస్తాం, బాబు అలిగితే: శివప్రసాద్, ఇక బాబు కీలక నిర్ణయం!

జగన్ అనూహ్య ప్రకటన

జగన్ అనూహ్య ప్రకటన

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరిలో ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ ఎంపీల రాజీనామా అంశాన్ని ప్రకటించారు. ఏపీకి హోదానే సంజీవిని అని, దాని కోసం తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం మార్చి 1 నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలుపుతారని చెప్పారు. మార్చి 3న తాను పాదయాత్ర చేస్తున్న స్థలం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలను ఢిల్లీకి పంపిస్తానని చెప్పారు. 5వ తేదీన వారు ప్యాకేజీ మాకు వద్దు.. హోదా మా హక్కు అనే డిమాండుతో ధర్నా చేస్తారని, నెల రోజుల పాటు సమావేశాలు ఉంటాయని, బడ్జెట్ సమావేశాల్లో హోదా ప్రకటించకుంటే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

<strong>జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?: మోడీపై బాబు 'స్నేహ' అస్త్రం</strong>జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?: మోడీపై బాబు 'స్నేహ' అస్త్రం

వేడెక్కిన రాజకీయం, అంతా డ్రామా అంటూ

వేడెక్కిన రాజకీయం, అంతా డ్రామా అంటూ

జగన్ ప్రకటన ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజేసింది. ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ చెబుతోంది. అయితే అదంతా వట్టిదేనని, అంతా డ్రామాలు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

రాజకీయం, అనుభవలేమి

రాజకీయం, అనుభవలేమి

జగన్ ప్రకటనపై సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ రాజీనామా ప్రకటనతో జగన్ పూర్తిస్థాయి రాజకీయ పరిణితి చెందిన నాయకుడిగా మారాడని చెప్పవచ్చునని కొందరు అంటే, మరోసారి ఆయన రాజకీయ అనుభవలేమి కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ దెబ్బ, బాబు దూకుడు: చెక్.. జగన్ రాజీనామా ప్రకటన వెనుక వ్యూహం!పవన్ కళ్యాణ్ దెబ్బ, బాబు దూకుడు: చెక్.. జగన్ రాజీనామా ప్రకటన వెనుక వ్యూహం!

జగన్ ప్రకటన వెనుక పెద్ద ప్లాన్

జగన్ ప్రకటన వెనుక పెద్ద ప్లాన్

జగన్ ప్రకటన వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పారని, కానీ ఎన్నికల నియమావళి ప్రకారం ఒక ఎంపీ స్థానం ఖాళీ అయితే ఉప ఎన్నికలు ఆరు నెలల లోపు నిర్వహించాలని, ఒకవేళ సాధారణ ఎన్నికలు సంవత్సరంలోపు ఉంటే ఉప ఎన్నికలు రావు అని అంటున్నారు.

ఉప ఎన్నికలు ఎందుకు రావు, సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది

ఉప ఎన్నికలు ఎందుకు రావు, సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది

చట్ట ప్రకారం ఎంపీలు స్వచ్చంధంగా రాజీనామా చేయాలి. సెక్షన్ 151(ఏ) ఇదే చెబుతోంది. అంతేకాదు, ఈ సెక్షన్లో మరో విషయం స్పష్టంగా ఉందని అంటున్నారు. ఎంపీలు రాజీనామా చేసినా సాధారణ ఎన్నికలకు ఏడాది లోపు సమయం ఉంటే రాజీనామా చేసినా ఉప ఎన్నికలు నిర్వహించరని ఆ సెక్షన్‌లో స్పష్టంగా ఉంది.

జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?

ఆ సెక్షన్‌లో ఇంకా ఏముందంటే

ఆ సెక్షన్‌లో ఇంకా ఏముందంటే

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. కానీ ఎంపీలు రాజీనామా చేస్తే దానిని పేర్కొనరాదు. ఎంపీలు ఎవరి ఒత్తిడితోను రాజీనామాలు చేయవద్దు. స్వచ్చంధంగా చేయాలి. రాజీనామా పత్రంలో కారణాలు వెల్లడించవద్దు. ఒకవేళ కారణం చెబితే.. అదే చూపిస్తూ రాజీనామాను తిరస్కరిస్తారు.

స్పీకర్ లేదా చైర్మన్ వెంటనే ఆమోదించాలని లేదు

స్పీకర్ లేదా చైర్మన్ వెంటనే ఆమోదించాలని లేదు

మరో కారణం ఏమంటే లోకసభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ వెంటనే రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని లేదు. రాజీనామా ఈ సమయంలోపు ఆమోదించాలని లేదు. వారు ఆమోదించిన తర్వాతే ఖాళీ అవుతుంది. దానిని ఈసీకి తెలియజేస్తారు. ఆ తర్వాత ఈసీ ఉప ఎన్నికకు సిద్ధమవుతుంది. కానీ సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు అయితే ఉప ఎన్నిక నిర్వహించరు.

అద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలుఅద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలు

విజయసాయి రెడ్డి రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక ఛాన్స్

విజయసాయి రెడ్డి రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక ఛాన్స్

సాధారణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ - మే 2019లో ఉన్నాయి. తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఆ రాజీనామాలు ఆమోదం పొందేవరకు ఏడాదిలోపు అవుతుంది. సెక్షన్ 151(ఏ) కింద ఉప ఎన్నికలు జరగవు. అయితే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాకు మాత్రం ఆమోదం తెలిపి, ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముంది. ఎందుకంటే ఆయన టర్మ్ 2022 వరకు ఉంది. కాగా, ఎన్నికలకు ముందు పక్కా వ్యూహంతో జగన్ రాజీనామా ప్రకటన చేసి అందర్నీ ఫూల్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

English summary
If the mass resignation of MPs is aimed at forcing by-elections, then the provisions of the Representation of People’s Act, especially Section 151 (A), could stand in the way. The section clearly states that no by-poll will be conducted to a vacant seat if the remainder period of their term is less than a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X