వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీ దాడి, జగన్ మౌనం: తెరాసలోకి తాటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించబడిన పోలవరం ముంపు మండలాల్లో ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస రావు, ఆ జిల్లా అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు వచ్చిన సమయంలో మాగంటి బాబు అనుచరులకు, తాటి వెంకటేశ్వర్లు అనుచరులకు మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో తాటికి గాయాలయ్యాయి. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న తాటి వెంకటేశ్వర్లుపై దాడి జరిగినా ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవటం పట్ల తాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

దీంతో మనస్థాపానికి గురైన ఆయన మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ముంపు మండలాల పరిస్థితితో పాటు తనపై జరిగిన దాడి విషయంపై కూడా చర్చించారు. అదే సమయంలో తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. 26వ తేదీన తన అనుచరులతో చేరవచ్చునని చెబుతున్నారు.

ఖమ్మం ఎమ్మెల్యేలు

ఖమ్మం ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఖమ్మం శాసన సభ్యులు మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.

ఖమ్మం ఎమ్మెల్యేలు

ఖమ్మం ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఖమ్మం శాసన సభ్యులు మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ మాగంటి బాబు అనుచరుల దాడిపై ఫిర్యాదు చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఇదిలా ఉండగా, కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి ఫిర్యాదు చేసిన తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.

అసదుద్దీన్

అసదుద్దీన్

కాగా, మజ్లిస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాదు నగరంలో నెలకొన్న సమస్యలైపై సీఎంతో చర్చించారు. స్పందించిన కేసీఆర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

English summary
YSR Congress Legislature Party leader in Telangana Assembly Thati Venkateswarlu is set to join the TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X