మేనేజర్లు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్పోరేట్ తరహా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్ రూపుదిద్దుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి జిల్లా పార్టీ కార్యాలయానికి ఒక మేనేజర్, మరో సహాయక మేనేజర్లను వైసీపీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే ఓ నాయకుడికి రాజకీయ ప్రాధాన్యం కల్పించే ఉద్దేశ్యంలో భాగంగానే ఇది జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సదరు నాయకుడి ఆలోచనలతో మేనేజర్ల వ్యవస్థ తెచ్చారంటున్నారు. దీంతో పలువురు నాయకులు ఈ మేనేజర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారంటున్నారు. మరోవైపు, ఈ నెల 5వ తేదీన తలపెట్టనున్న ఆందోళనకు కూడా వైసీపీ కార్పోరేట్ తరహా పద్ధతిని అవలంబిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీడీపీ నేతల భూదందా: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భూదందాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం జీవో 398ని తీసుకు వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం ఆరోపించారు.
కేసులకు భయపడవద్దు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ ప్రాంతంలో నాలుగువేల మెగావాట్ల పవర్‌ప్రాజెక్టుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బారువ పట్టణంలో పీపీఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సిరియా సాయిరాజ్, ఇప్పిలి కృష్ణారావు, సీపీఎం నుంచి అల్లు సత్యనారాయణ, బీజేపీ నుంచి అబ్బాయి నాయుడు, మత్స్యకార ఐక్యవేదిక నుంచి మడ్డు రాజారావు, కళాసీ సంఘ అధ్యక్షుడు తడక చంద్రయ్యతోపాటు వివిధ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.
థర్మల్ ప్లాంట్‌ను అడ్డుకునే క్రమంలో పోలీసు కేసులకు ఎవరూ భయపడవద్దని సిరియా సాయిరాజ్ పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ స్థాపన ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వమన్నారు.












Click it and Unblock the Notifications