వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులతో గెలుపా? రంగంలోకి పీకే: జగన్ ఓకే, వైసిపి నేతల్లో కొత్త ఆందోళన

ఇటీవల గడపగడపకూ వైసీపీ, వైయస్సార్ కుటుంబం, నవరత్నాల కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఆశించిన విధంగా తీసుకు వెళ్లలేదని వైసిపి అధినేత వైయస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSR Congress Party Cadre Afraid Of Prashant Kishore Team రంగంలోకి పీకే..జగన్ ఓకే.. | Oneindia Telugu

అమరావతి: ఇటీవల గడపగడపకూ వైసీపీ, వైయస్సార్ కుటుంబం, నవరత్నాల కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఆశించిన విధంగా తీసుకు వెళ్లలేదని వైసిపి అధినేత వైయస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

భారీ షాక్: టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్? ఏం చేద్దామని జగన్ ఆరాభారీ షాక్: టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్? ఏం చేద్దామని జగన్ ఆరా

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయనే అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధినేతకు ఓ నివేదిక కూడా ఇచ్చారని తెలుస్తోంది. తామే వీటిని జనాల్లోకి తీసుకెళ్తామని పీకే చెప్పగా, జగన్ ఓకే చెప్పారని అంటున్నారు.

 ప్రశాంత్ కిషోర్ టీంకు జగన్ ఓకే

ప్రశాంత్ కిషోర్ టీంకు జగన్ ఓకే

పార్టీ కార్యక్రమాలను వైసిపి నాయకులు, కార్యకర్తలు అనుకున్నంత సీరియస్‌గా తీసుకోలేదని, అందుకే అంత ప్రభావం కనిపించలేదని పీకే.. జగన్‌కు చెప్పారని తెలుస్తోంది. ఇలా ముందుకు వెళ్తే కష్టమని పీకే చెప్పారు. తామే ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పడంతో, జగన్ సరేనని చెప్పారని అంటున్నారు.

 జగన్ సరేననడంతో పీకే టీం

జగన్ సరేననడంతో పీకే టీం

జగన్ ఓకే చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ అన్ని నియోజకర్గాల్లో తన టీంను ఎంపిక చేసుకొని, వైసిపి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు సభ్యుల బృందం పని చేయనుంది. వీరు నియోజకవర్గాల్లోని పనితీరును నివేదిక రూపంలో పంపించనున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకు మరో వెయ్యి మందిని తన టీంలోకి తీసుకోనున్నారని అంటున్నారు. వీరికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

 పోల్ మేనేజ్మెంట్ లేకే ఓటమి

పోల్ మేనేజ్మెంట్ లేకే ఓటమి

పీకే టీంలోకి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థ పేరుతో తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వీరు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పీకే డైరక్షన్‌లో పని చేస్తారు. పార్టీ కేడర్‌తో సమాంతరంగా నియమితులవుతున్న వీరి ముఖ్య విధి పోల్ మేనేజ్మెంట్. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పోల్ మెనేజ్మెంట్ చేయలేకే ఓడిపోయినట్లు భావిస్తున్నారు.

 ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి

ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి

ఈ పీకే టీం సభ్యుల పనిని ఇప్పటికే జిల్లాల్లో ఉన్న బృందం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే పీకే బృందం చేసిన సర్వేతో పాటు గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయిన స్థానాలపై దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతిపరులను ఓటర్లుగా మార్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

 ఇక్కడే చిక్కు, ఉద్యోగులతోనా.. పార్టీలో ఆందోళన

ఇక్కడే చిక్కు, ఉద్యోగులతోనా.. పార్టీలో ఆందోళన

అయితే పార్టీలో కిందిస్థాయి నుంచి మొత్తం పీకే బృందమే కనిపిస్తూండటంతో వైసిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. క్యాడర్‌తో పని చేయించుకుంటనే ఫలితం ఉంటుందని ఉద్యోగులతో చేయిస్తే ప్రయోజనం ఉండదని కొందరు నేతలు అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది.

 చెప్పినా స్పందన లేదా?

చెప్పినా స్పందన లేదా?

అయితే అధిష్టానానికి చెప్పినా స్పందన లేదని తెలుస్తోంది. పీకే టీం పైన కూడా కొందరు నేతలు అనుమానంగా ఉన్నట్లుగా వైసిపిలోనే చెవులు కొరుక్కుంటున్నారట. కొంతమంది నేతలు తమపై నిఘా పెట్టి లేనిపోనివి నివేదికల ద్వారా పీకేకు పంపిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

 గెలుపు కోసం భరించాలని

గెలుపు కోసం భరించాలని

పార్టీ గెలుపు కోసం కొన్ని భరించక తప్పదని వైసిపి అధిష్టానం చెబుతోంది. వైసిపిలో ఇటీవలి కాలంలో జగన్ ఉత్సవ విగ్రహంగా మారిపోతున్నారని కొందరు అసంతృప్త నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతా పీకే చేతుల్లో పెట్టడం కొందరికి రుచించడం లేదని అంటున్నారు. అయితే, ఎవరి మాటా వినడని చెప్పే జగన్.. ఉత్సవ విగ్రహంలా మిగిలారని చెప్పడం విడ్డూరమని, పార్టీలో నిర్ణయాలు ఆయన చేతుల్లోనే ఉంటాయని మరికొందరు అంటున్నారు.

English summary
It is said that YSR Congress Party cadre afraid of Prashant Kishore team. It is said that PK will engage 1000 members in every constituency for YSRCP programs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X