• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు చేసిన పొరపాటే జగన్ సైతం : వైసీపీ అధినేత ధీమా అదేనా : అసలుకే ఎసరు..!!

By Lekhaka
|

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. మంత్రివర్గం సైతం మూడో ఏట అడుగు పెట్టింది. జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు. చంద్రబాబు పైన విశ్వాసాన్ని సన్న గిల్లేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. తన తండ్రికి..తనకు ఉన్నది విశ్వసనీయత మాత్రమే అంటూ అదే ఆయుధంగా ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. జగన్ కోసం దేనికైనా సిద్దమనే అభిమానులు..వైఎస్సార్ ఫ్యామిలీ పైన అభిమానం పెంచుకున్న కార్యకర్తలు..అయిదేళ్ల టీడీపీ పాలనలో కష్టాలు ఎదుర్కొన్న కేడర్ అందరూ..కలిసి జగన్ అధికారంలోకి రావటానికి శక్తి వంచన లేకుండా పని చేసారు. జగన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక సమీకరణాల్లో భాగంగా పలువురికి కేబినెట్ లో ఊహించని విధంగా అవకాశం కల్పించారు. వారికి రెండున్నారేళ్లు మాత్రమే ఉంటారని స్పష్టం చేసారు. పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు. కీలకమైన ముఖ్యులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. కొన్ని జిల్లా స్థాయిలో పోస్టులు... కులా సంఘాల వారీగా వాటి కార్పోరేషన్లలో అవకాశం కల్పించారు.

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు..

  నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు..

  ఇంకా భర్తీ చేయాల్సిన రాష్ట్ర స్థాయి..జిల్లా స్థాయి పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కరోనా కారణంగా ఏడాది కాలంగా అవి పెండింగ్ లో ఉన్నాయి. నిత్యం ప్రజలు..కార్యకర్తలతో మమేకం అయ్యే జగన్ ..సీఎం అయిన తరువాత పూర్తిగా భిన్నంగా ఉంటున్నారు. సీఎం స్థాయిలో పాలనా వ్యవహారాల ఒత్తిడి ఉండటం సహజమే అయినా..పార్టీ వ్యవహారాలు పూర్తిగా ఇన్ ఛార్జ్ లకే అప్పగించారు. ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫిరెన్స్ ల్లో కనిపించినా ఆప్యాయంగా పలకరించే సీఎం..వారికి గతంలో లాగా అప్పాయింట్ మెంట్లు ఇవ్వటం లేదనే వాదన పార్టీలో వినిపిస్తోంది. కొంత మంది మాత్రమే ఆయన్ను నేరుగా కలవగలుగుతున్నారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తన తండ్రి ప్రజలతో మమేకం అయ్యేందుకు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్ సీఎంగా ఉండగా క్యాంపు కార్యాలయంలో ప్రతీ రోజు సాధారణ ప్రజలు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేది.

  పార్టీ నేతలు..ప్రజలతో కలిసేదెప్పుడు..

  పార్టీ నేతలు..ప్రజలతో కలిసేదెప్పుడు..


  ఇప్పుడు ఎవరైనా సాధారణ ప్రజలు సీఎంను కలవాలంటే సాధ్యపడటం లేదు. కొద్ది రోజులు ప్రజా దర్బార్ కోసం అంటూ సీఎం నివాసం వద్ద ఏర్పాట్లు చేసినా..అవి ముందుకు సాగలేదు. ఇక, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల్లో ప్రజలతో నేరుగా మమేకం అయి..పధకాల నిర్వహణ గురించి పర్యటనలు చేస్తారని చాలా కాలంగా చెబుతున్నా..రెండేళ్ల వరకు ఇటువంటి పర్యటన ఒక్కటీ జరగలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత పధకాల ప్రారంభానికి మినహా ఏ జిల్లాలోనూ సీఎం పర్యటన లేదు. ఇక, పార్టీ పరంగా అసలు సమీక్షలే చేయలేదు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారే పార్టీలో పరిస్థితులు..సమస్యల గురించి ముఖ్యమంత్రి భ్రీప్ చేస్తున్నారు. వరుసగా అన్ని ఎన్నికల్లో విజయం సాధించటం తో...అంతా పాజిటవ్ వేవ్ ఉందనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

   చంద్రబాబు చేసిన పొరపాటే..

  చంద్రబాబు చేసిన పొరపాటే..


  అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే తరహా లో పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసారు. అధికారిక పనుల మీదనే ఫోకస చేసారు. దీంతో..పార్టీ నేతల్లో ప్రతికూలత ఉన్నా..ఎవరికీ చెప్పుకోలేక పోయారు. చంద్రబాబు కోటరీ దగ్గరకు వచ్చినా..ఫలితం ఉండేది కాదు. దీని ఫలితంగా ప్రజల మూడ్ ఏంటనేది గ్రహించటంలో ..వాస్తవాలు తెలుసుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారు. పూర్తిగా తన కోటరీ..ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగానే చంద్రబాబు అడుగులు వేసేవారు. అయితే, కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితులను పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంకా సమయం ఉన్నందున ప్రజల్లోకి వెళ్లటం..పార్టీ నేతలతో సమీక్షలు ఖచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సైతం చాలా తక్కువ రోజులు ఉండటంతో ఎమ్మెల్యేలు నేరుగా సీఎంను కలుద్దామని భావించినా అనుకూలించటం లేదు. దీంతో..పార్టీపైన నేరుగా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టాల్సిన అవసరం పైన మాత్రం పార్టీలోనే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.

  English summary
  YSRCP party cadre is not satisfied as CM Jagan is not concentrating on the cadre.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X