వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్లాన్: గెలుపు గుర్రాలకే టిక్కెట్లు, విశాఖ నుండి ప్రయోగం?

2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని వైసీపీ చీఫ్ జగన్ యోచిస్తున్నారు. విశాఖ జిల్లా నుండి ఈ ప్రయోగాన్ని చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సర్వే నివేదిక ఆధారంగా టిక్కెట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

పాదయాత్రకు ముందు జగన్ కీలక అడుగులు : వాళ్లే టార్గెట్?

విశాఖపట్టణం: 2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కనివారికి పార్టీ పదవులను ఇవ్వాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. సీనియర్లకు పార్టీ పదవులు కట్టబెట్టాలనే యోచనలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఉన్నారు.ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

2019 ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు వైసీపీ కసరత్తు చేస్తోంది. మరో వైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు ప్రశాంత్‌కిషోర్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీ టిక్కెట్లు ఆశించే నేతలు, ప్రత్యర్థి పార్టీల నేతల బలాబలాల సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా వచ్చే ఎన్నికల్లో నేతలకు టిక్కెట్లను కేటాయించనున్నారని సమాచారం.

టిక్కెట్లు దక్కని వారికి పార్టీ పదవులు

టిక్కెట్లు దక్కని వారికి పార్టీ పదవులు


2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం వున్నవారిని పార్టీ పదవుల్లో నియమించకుండా దూరంగా ఉంచాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఆ పోటీకి దూరంగా వుండే సీనియర్లు, పార్టీ కార్యకలాపాల నిర్వహణలో అనుభవం వున్నవారికి పార్టీ పదవులను కట్టబెట్టనున్నట్టు సమాచారం. పార్టీ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) సలహా, సూచనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారిని పార్టీ పదవుల నుంచి తప్పించి, పోటీచేయని సీనియర్లను పార్టీ పదవుల్లో నియమించాలనే యోచనలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

సర్వేల ఆదారంగానే వైసీపీ ప్లాన్

సర్వేల ఆదారంగానే వైసీపీ ప్లాన్

వైసీపీ సర్వేల ఆధారంగా ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయమై క్షేత్రస్థాయిలో ప్రశాంత్‌కిషోర్ బృందం సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.సర్వేల ప్రకారం సమర్థులైనవారిని ప్రస్తుతానికి సమన్వయకర్తలుగా కొనసాగిస్తూనే ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచనివారిని తొలగించే అవకాశం వుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

విశాఖ నుండి వైసీపీ ప్రయోగం

విశాఖ నుండి వైసీపీ ప్రయోగం

గత సాధారణ ఎన్నికల తర్వాత వైసీపీ జిల్లా, నగర శాఖలను విలీనం చేసి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిగా అమర్‌ కొనసాగుతున్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం వుండడంతో నగరంలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టిసారించాలని భావిస్తున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పార్టీ నగర అధ్యక్షుడిగా ఒకరిని, రూరల్‌ జిల్లా అధ్యక్షుడి మరొకరిని నియమించాలనే భావనతో వుంది.

విశాఖ జిల్లా వైసీపీలో సంస్థాగత మార్పులు

విశాఖ జిల్లా వైసీపీలో సంస్థాగత మార్పులు

భవిష్యత్‌లో పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు.ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న గుడివాడ అమర్‌ను ఆ పదవి నుంచి తప్పించే అవకాశం వుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అమర్‌ను అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటికి నిలిపే అవకాశం వుండడమే అందుకు కారణంగా పేర్కొంటున్నారు. అలాగే పార్టీ నియోజవర్గం సమన్వయకర్తలుగా పనిచేస్తున్న వారిపై జరిపిన సర్వేల ప్రకారం సమర్థులైనవారిని ప్రస్తుతానికి సమన్వయకర్తలుగా కొనసాగిస్తూనే ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచనివారిని తొలగించే అవకాశం వుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనినిబట్టి ఇప్పుడు సమన్వయకర్తల్లో చాలామందికి ఉద్వాసన తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగరానికి ప్రత్యేక కమిటీ

నగరానికి ప్రత్యేక కమిటీ

గతంలో మాదిరిగానే పార్టీకి సిటీ, రూరల్‌ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటుచేసే యోచనలో అధిష్ఠానం వుంది. జీవీఎంసీకి ఎన్నికలు జరిపే వాతావరణం కనిపిస్తుండడంతో నగరానికి ప్రత్యేకంగా కార్యవర్గం ఏర్పాటు చేయాల్సిందేనన్న భావన అధిష్ఠానంలో చాలాకాలంగా వుంది. దీంతో సమర్థుడైన నాయకుడు, ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక లేని అనుభవజ్ఞుడిని నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ అధినేత జగన్‌ భావిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాల కోసం అన్ని రకాలుగా పనిచేయగలిగిన వ్యక్తి కోసం అన్వేషణ చేస్తున్నది.

English summary
Ysrcp chief Ys Jagan planning to strenthen party.it is planning to give senior leaders for party posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X