వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద కుట్రే?: వైసీపీ అంత పనిచేస్తోందా!.. టీడీపీ అనుమానం..

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఐఏఎస్‌లు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్న వైసీపీ ఆరోపణల్లో నిజమెంత?.. ఏ ఆధారమూ లేకుండానే.. కేవలం ప్రభుత్వాధికారులను బద్నాం చేయడం కోసమే ఆరోపణలు చేస్తున్నారా?..

Recommended Video

Vijay Sai Reddy Says I Have Proofs Against IAS, IPS Officers

వైసీపీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే.. టీడీపీ మాత్రం ఇదంతా బురదజల్లే ప్రయత్నమే అంటోంది. అంతేకాదు, దీని వెనుకాల పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తోంది.

చంద్రబాబుకు లోక్ సత్తా అధినేత జెపి మద్దతు పలుకుతోంది అందుకా?.. చంద్రబాబుకు లోక్ సత్తా అధినేత జెపి మద్దతు పలుకుతోంది అందుకా?..

దాన్ని తెరమరుగు చేసేందుకే?:

దాన్ని తెరమరుగు చేసేందుకే?:

ఇందూ టెక్‌జోన్‌ కుంభకోణం ఇప్పుడు వైఎస్ జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఏకంగా ప్రధాని కార్యాలయానికే నోటీసులు జారీ అవడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో.. జగన్ తనపై అవినీతి చర్చ జరగకుండా ఉండేందుకే.. ఆ పార్టీ నేతల చేత లేని పోని ఆరోపణలను తెర పైకి తీసుకొస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

జగన్ 'కుట్ర': టీడీపీ అనుమానం..

జగన్ 'కుట్ర': టీడీపీ అనుమానం..

కేవలం ఆరోపణలే కాదు.. జగన్&కో ప్రభుత్వాధికారులను బద్నాం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఐఏఎస్ లకు అవినీతి, అక్రమ వ్యవహారాలతో లింకులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పరమైన వ్యవహారాలు ముందడుగు వేయకుండా చేసే కుట్ర ఉందని అంటున్నాయి.

ప్రభుత్వ పథకాలు నిలిచిపోతే పాలన స్తంభించిపోయే అవకాశం ఉంది కాబట్టి.. ఆ కుట్రతోనే ప్రభుత్వానికి ఐఏఎస్ లకు మధ్య పేచీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ వాదనగా తెలుస్తోంది.

 నిజంగా అధికారులే బేరసారాలు జరిపారా?:

నిజంగా అధికారులే బేరసారాలు జరిపారా?:

టీడీపీ ఆరోపణల సంగతెలా ఉన్నా.. మరోవైపు వైసీపీ మాత్రం తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతోంది. మరికొద్ది రోజులు దీనిపై చర్చ జరగాలని.. అప్పుడు నిజాలేంటో బయటపెడుతామని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ లాంటివారు చెబుతున్నారు. ఐఏఎస్ లు కాస్త టీడీపీ నేతలుగా మారిపోయారని, వైసీపీ నేతలతో బేరసారాల కోసం ఏకంగా వారే రంగంలోకి దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఆధారాలుంటే.. బయటపెట్టాలి కదా!:

ఆధారాలుంటే.. బయటపెట్టాలి కదా!:

తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ.. వాటిని బయటపెడితే కానీ నిజాలేంటో తేలవు. అప్పటిదాకా ఆ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా వాటికి అంతగా బలం చేకూరే అవకాశం లేదు.

పైగా రాజకీయ నాయకులను ఎదుర్కోవాల్సింది పోయి ప్రభుత్వాధికారులపై నిందలు వేయడం ఆ పార్టీ పట్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లే అవకాశముంది. కాబట్టి ఆధారాలుంటే వాటిని బయటపెట్టి సవాల్ చేస్తే తప్ప వైసీపీ ఆరోపణలను ప్రజలు నమ్మడం కష్టమంటున్నారు.

English summary
TDP members suspecting that YSRCP planned a conspiracy on Govt by attacking IAS offcials with fake allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X