వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోండి, లేదంటే తప్పుడు సంకేతాలు: స్పీకర్‌కు విజయసాయి

|
Google Oneindia TeluguNews

Recommended Video

జంపింగ్ ఎంపీలను తొలగించండి

న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. వారిపై అనర్హత వేటు వేసి ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని కోరారు.

ఈ మేరకు ఆయన వినతిపత్రాన్ని శుక్రవారం స్పీకర్‌కు సమర్పించారు. వైయస్సార్‌సీపీ టిక్కెట్లపై గెలుపొంది ఇతర పార్టీల్లోకి ఫిరాయించి రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పి.శ్రీనివాస్‌రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని జనవరి 3, 2018న అప్పుడు చీఫ్‌విప్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి స్పీకర్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు.

YSRCP Demands Expulsion Of Defected MPs

'ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని మా పార్టీ డిసెంబర్‌ 14, 2016న మీ వద్ద పిటిషన్‌ దాఖలు చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై అనర్హత నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనందువల్ల.. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఎలాంటి చర్యలు ఉండవన్న సంకేతాన్నిస్తూ ఇతర ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించేందుకు విశ్వాసం కలిగించింది' అని అన్నారు.

'రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్య తీసుకుని మీరు(స్పీకర్) మార్గదర్శిగా నిలవాలని కోరుతున్నా. ఆ నలుగురు సభ్యులపై అనర్హత వేటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నా..'' అని విజయసాయిరెడ్డి విన్నవించారు.

English summary
YSR Congress party (YSRCP) Parliamentary party leader V Vijaya Sai Reddy today met Lok Sabha Speaker Sumitra Mahajan and requested her to expel the four MPs who won the election on YSRCP ticket and later shifted loyalties to the ruling Telugu Desam Party (TDP). The Rajya Sabha MP presented a memorandum to the Speaker, requesting her to immediately suspend the MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X