• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతిలో రికార్డులు తిరగరాసే జగన్‌ వ్యూహమిదే- 7 ప్లస్ 7 ప్లాన్‌- టాప్‌లో ఆ ఇద్దరు

|

ఏపీ జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ఘన విజయాలు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. దీంతో తిరుపతి కోసం ప్రత్యేక వ్యూహాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఏయే స్ధానాల్లో ఉండాల్లో జగన్ ముందే క్లారిటీ ఇచ్చేశారు. గతంలో నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా రాష్ట్ర కేబినెట్‌నంతా దింపారని చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్‌.. తాను మాత్రం అలాంటి విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి కూడా జగన్ ప్రచార బరిలోకి దిగడం లేదు.

టీడీపీకి బిగ్ షాక్... వైసీపీ ఎమ్మెల్యేతో ఏడుగురు విశాఖ కార్పోరేటర్ల భేటీ... వివరణ కోరిన పార్టీ అధిష్టానం...

 తిరుపతి ఉపఎన్నికలపై వైసీపీ దృష్టి

తిరుపతి ఉపఎన్నికలపై వైసీపీ దృష్టి

తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వచ్చే నెల 17న ఉపఎన్నిక నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో అన్ని పార్టీలు ఇప్పుడు తిరుపతి ఎన్నికల మీద పడ్డాయి. మిగతా వారి పరిస్ధితి ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో గెలుపు, సాధించే మెజారిటీ వైసీపీకి అత్యంత కీలకంగా మారిపోయింది. అసలే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాల నేపథ్యంలో బరిలోకి దిగితున్న వైసీపీ.. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీంతో వైసీపీ ఇప్పుడు తిరుపతిలో పూర్తిగా దృష్టిసారిస్తోంది.

 తిరుపతిలో రికార్లులు తిరగరాయాలని వైసీపీ ప్లాన్‌

తిరుపతిలో రికార్లులు తిరగరాయాలని వైసీపీ ప్లాన్‌

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులు, తాజా స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు, తిరుపతి కార్పోరేషన్‌లో వైసీపీ హవా.. ఇలా ఏ రకంగా చూసినా తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని అర్ధమవుతోంది. ఈ విషయం వైసీపీకి కూడా అర్ధమైపోయింది. దీంతో ఇక్కడ తాము నిలబెట్టే అభ్యర్ధి సాధించే మెజారిటీ కీలకంగా మారిపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌ ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిపై 2 లక్షల 28 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు దీనికి రెట్టింపు మెజారిటీతో దేశం దృష్టిని ఆకర్షించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

 జగన్ మార్క్‌ 7 ప్లస్‌ 7 ప్లస్‌ 2 వ్యూహం

జగన్ మార్క్‌ 7 ప్లస్‌ 7 ప్లస్‌ 2 వ్యూహం

తిరుపతి ఉపఎన్నికల్లో గెలుపు కంటే మెజారిటీయే ప్రధానంగా మారిపోయిన పరిస్ధితుల్లో వైసీపీ అధినేత జగన్‌ భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. అలాగని ఉపఎన్నిక కోసం భారీ బలగాన్ని దింపారన్న విమర్శలు ఎదురు కాకూడదు. అందుకే ఇప్పుడు ఆయన అక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, కీలక స్ధానాల్లో వ్యూహకర్తలుగా మరో ఇద్దరు నమ్మిన బంట్లను జగన్‌ నియమించారు. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో వైసీపీ రికార్డు మెజారిటీ సాధించే భారాన్ని జగన్‌ వీరిమీదే వేశారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల తరహాలో తిరుపతిలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్‌ పెట్టినట్లయింది.

 తిరుపతిలో వైసీపీ ప్రచార, వ్యూహకర్తలు వీరే

తిరుపతిలో వైసీపీ ప్రచార, వ్యూహకర్తలు వీరే

తిరుపతి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడుగురు కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా మరో ఏడుగురు ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతున్నారు. ఇందులో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు పేర్నినాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తికి మంత్రి గౌతం రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలు సహకారం అందిస్తారు. ఆయా మంత్రుల్ని సైతం సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలో వైసీపీ మెజారిటీ సాధనకు వ్యూహకర్తలుగా కీలక నేతలైన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ నియమించారు.

English summary
ysrcp president ys jagan confirms party strategy for upcoming tirupati byelection. he would like to go with 7 ministers plus 7 mlas for campaign and two key leaders as observers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X