• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పార్టీ నాయకులపై బీరు బాటిళ్లతో వైసీపీ కార్యకర్తల దాడి: మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందంటూ: బీజేపీ

|

చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆరోపిస్తున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ను దాఖలు చేయడానికి వెళ్లిన కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.

రక్తమోడుతున్న ఇద్దరు కార్యకర్తల వీడియోను వారు ట్వీట్ చేశారు. చిత్తూరుజిల్లాలోని పులిచెర్ల మండలంలో ఈ దాడి చోటు చేసుకుందని, దీని వెనుక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రమేయం ఉందని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, ఆయన నియోజకవర్గం పరిధిలో తాము అత్యధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని అన్నారు. దీన్ని భరించలేకనే ఆయన తన అనుచరులతో పార్టీ కార్యకర్తలపై ప్రాణాంతక దాడులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

 YSRCP goons brutally attacked on our workers, alleged BJP AP leaders

పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై తాము చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పులిచెర్ల సమీపంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ దాడిలో మదన్‌మోహన్‌, ప్రేమ్‌కుమార్‌, మాదాసు లోకేశ్‌, దొరస్వామి, హరిబాబు, పోలిశెట్టి వెంకట్రావులకు గాయాలయ్యాయని అన్నారు.

స్థానిక పోరు.. వారసుల జోరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి కుమార్తె ఎంట్రీ..?

  Minister Peddireddy Ramachandra Reddy Counters On Chandrababu & TDP | Oneindia Telugu

  వైసీపీ నాయకులు బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో బీజేపీ నాయకుల కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని, తమ నాయకులు వారి బారి నుంచి తప్పించుకుని కల్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రకటనల్లో ఏ మాత్రం వాస్తవం లేదనే విషయం ఈ ఘటనతో నిరూపితమైందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని తాము రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు.

  English summary
  Rulling YSR Congress Party goons brutally attacked on BJP karyakartas and supporters in Pulicherla mandal in Chittoor district, says BJP Andhra Pradesh senior leader, MLC PVN Madhav. The BJP workers, while on their way to file nomination for MPTC elections, Minister Peddireddy Ramachandra Reddy supporters allegedly attacked them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more