వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు నెలల్లో అన్ని వైఫల్యాలే... జగన్ పాలనపై చంద్రబాబు నాయుడు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు పూర్తి చేసుకున్న సంధర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశారు. ఆరునెలల్లో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన ఆరోపణలు చేశారు. గతంలో ఎప్పుడు కూడ సామాన్య ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలను తాను చూడలేదని అన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే రాష్ట్రానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే: బైక్ లో వెళ్లి, వీడియో, అత్త ఆవేదన ! గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే: బైక్ లో వెళ్లి, వీడియో, అత్త ఆవేదన !

వైకాపా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా ఇసుక కొరతతో 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు కూడ ఆకాశనంటుతున్నాయని అన్నారు. ఇక ఇటివల మద్యం ధరలు కూడ 200 శాతం పెరిగాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న విధాన నిర్ణయాలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాని అన్నారు. దీంతో యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వ వైఫల్యాలను అన్ని గ్రామకమిటీల్లో చర్చించాలని ఆయన సూచించారు.

YSRCP government have failed in the six months of its Term

పార్టీ గ్రామకమీటిల ఏర్పాటుపై టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తలు పంచాయితీ ఎన్నికల్లోపు సంస్థగతంగా సన్నద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల వరకు అన్ని గ్రామ కమీటిలు ఏర్పడాలని సూచించారు. ఇక ప్రతి గ్రామ కమిటిల్లో 33శాతం మేర యువతకు, మహిళలకు పార్టీలో మూడోవంతు పదవులు. బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలకే 50% పదవులకు అవకాశం కల్పించాలని ఆయన నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
YSRCP government have failed in the six months of its term criticised the TDP chief Chandrababu naidu.he conducted teleconference with party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X