సీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన తర్వాత వైసీపీలో అక్కడక్కడా వర్గ విభేదాలు పొడచూస్తుండగా.. తొలిసారి తారా స్థాయిలో బడా నేతలు దూషించుకుని, దాడులకు సిద్ధమైన ఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందటి జిల్లా డీఆర్సీ సమావేశంలో.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఘర్షణ పడటం, అమ్మనాబూతులు తిట్టుకోవడం సంచలనం రేపింది. సీన్ కట్ చేస్తే..
పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

సీఎం జనగ్ జోక్యంతో..
తూర్పుగోదావరి డీఆర్సీ సమావేశం సాక్షిగా ఎంపీ, ఎమ్మెల్యే తగువులాడుకోవడం, బూతులు తిట్టుకోవడం ద్వారా పార్టీ పరువు బజారున పడడంతో అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని, గట్టి క్లాస్ పీకారు. బహిరంగ వేదికలపై పరస్పరం విమర్శలు చేసుకోవద్దని సీఎం హితవు పలికారు. జగన్ క్లాస్ ఎఫెక్ట్ తో సెట్ రైట్ అయిన సదరు నేతలు ఇప్పుడు జిల్లా వేదికగా ఒకే చోటకు చేరి ఐక్యతను ప్రదర్శించారు. తద్వారా జగన్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ఎమ్మెల్యే ఇంటికి ఎంపీ
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఇంటికి ఆహ్వానించారు. బోస్ ఇంటికి రాగానే లోపలికి రావాలంటూ ద్వారంపూడి స్వాగతం పలికారు. ఐక్యతకు గుర్తుగా, తామంతా ఒకటేనని ప్రజల్లోకి సందేశం వెళ్లేలా నేతలిద్దరూ కలిసి ఫొటోలు దిగారు. సీఎం జగన్ సూచన మేరకే వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. బోస్ తో సమావేశానికి కొందరు బీసీ నేతలను కూడా ద్వారంపూడి ఆహ్వానించారు. అంతకుముందు..

టీకప్పులో తుఫాను..
డీఆర్సీ సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించి ఎంపీ బోస్ గతంలోనే వివరణ ఇచ్చారు. తాను మాట్లాడింది ద్వారంపూడి అవినీతిపై కాదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాల గురించని మీడియాకు వివరించారు. ‘‘కాకినాడ మేడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది. కాకినాడ మేడలైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించారు. కాకినాడ డీఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో తుపాను లాంటిది. కోపంలో ఇవన్నీ కామన్. బేసిగ్గా నేను ఆవేశపరుణ్ని కాను. ఒక్కో నేతది ఒక్కో తీరు. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇల్లు ఇస్తున్నప్పడు అవినీతికి ఆస్కారమే లేదు'' అని ఎంపీ బోస్ పేర్కొన్నారు.

బోస్‌ను పిలిపించి అవమానించారు..
అధికార వైసీపీలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను దూషించినందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. ఇంటికి పిలిపించుకుని అహంకారాన్ని ప్రదర్శించారని, తద్వారా బోసును మళ్లీ మళ్లీ అవమానించారని రవీంద్ర అన్నారు. ‘‘జగన్ బినామీగా చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కాబట్టే సీఎం కార్యాలయానికి పిలిపించుకుని మరీ బెదిరించబట్టే ఎంపీ బోస్.. ద్వారంపూడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వైసీపీలో ఉన్న బీసీల పరిస్థితి ఎలా ఉందో బోస్ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. కుర్చీ కూడా వేయకుండా మొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని, ఇప్పుడు చంద్రబోస్‌ను ఇంటికి పిలిపించుకుని ద్వారంపూడి అవమానించారు. ఇదేనా సీఎం కుదిర్చిన సయోధ్య?'' అని రవీంద్ర ఫైరయ్యారు.
కేటీఆర్ వల్లే డ్యామేజ్, కేసీఆర్ బలి -ఎత్తిపోతలంటే ఇదే -బీజేపీనీ తరుముడే: రేవంత్ ఫైర్