విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జడ్డీలపై కామెంట్ల కేసు- రేపు సీబీఐ ముందుకు ఆమంచి- విశాఖలో విచారణ

|
Google Oneindia TeluguNews

ఏపీలో గతంలో హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య కోల్డ్‌ వార్ సాగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఐడీ ఇచ్చిన నివేదికతో సంతృప్తి చెందని హైకోర్టు ఈ కేసును సీబీకి అప్పగించింది.

హైకోర్టు జడ్లీలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు ఈ నెల 6న హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. అయితే ఆ రోజు వ్యక్తిగత పనుల కారణంగా మినహాయింపు ఇవ్వాలని ఆమంచి కోరారు. దీంతో ఆయన్ను రేపు విశాఖలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. రేపు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు.

ysrcp leader amanchi to appear before cbi tomorrow for his comments against judges

హైకోర్టు జడ్డీలపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దాదాపు వంద మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో తీవ్రమైన వాటిపై ప్రస్తుతం సీబీఐ ముందుగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు పంపుతోంది. ఇదే క్రమంలో ఆమంచికి కూడా నోటీసులు పంపింది. ఆమంచి వివరణతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు సీబీఐ సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు జడ్డీలపై వ్యాఖ్యల కేసులో సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి వైసీపీ నేత కూడా ఆమంచే కావడం విశేషం.

English summary
cbi visakhapatnam unit has issued notices to ysrcp leader and former mla amanchi krishna mohan to appear before them tomorrow for his deregatory comments against high court judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X