వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవితో సత్సంబంధాలు..వాటితో నాకు సంబంధం లేదు: వారి కుట్రే: చెవిరెడ్డి..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైన సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభిమాన సంఘం పేరుతో పోస్టింగ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. గతంలో జగన్ అరెస్ట్ సమయంలో రాం చరణ్ చేసిన కామెంట్ ను అందులో ప్రస్తావించారు. అదే సమయంలో నాడు వైయస్ కుటుంబం మీద కసిగా వ్యవహరించిన మెగా కుటుంబం నేడు ముఖ్యమంత్రి జగన్ అప్పాయింట్ మెంట్ కోసం నిరీక్షిస్తున్నారంటూ పేర్కొన్నారు. అదే కాల మహిమ అంటూ పోస్ట్ చేసారు.

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!

దీని మీద వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వివరణ ఇచ్చారు. తన అభిమాన సంఘం పేరిట చిరంజీవి పైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగ్ లకు తనకు ఎటువంటి సంబంధలేని స్పష్టం చేసారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

YSRCP leader Chevireddy Bhaskara Reddy denied postings on chiranjeevi by his fans name

చిరంజీవితో మంచి సంబంధాలున్నాయి..
మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని తెలిపారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు.

జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

14న ముఖ్యమంత్రితో చిరంజీవి లంచ్ మీటింగ్..
ఇది ఇలా ఉండగా..ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి భేటీ కావాలని నిర్ణయించారు. తనతో భేటీ కావాలనుకుంటున్నానని చిరంజీవి నుండి సమాచారం రాగానే..స్పందించిన ముఖ్యమంత్రి లంచ్ కు తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 14న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నివాసంలో చిరంజీవి..రాం చరణ్ కు లంచ్ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా సైరా సినిమా వీక్షించాల్సిందిగా చిరంజీవి ముఖ్యమంత్రిని ఆహ్వానించే అవకాశం ఉంది.

కొద్ది కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న చిరంజీవి రాష్ట్ర విభజన తరువాత అధికారంలో ఉన్న చంద్రబాబును ఏనాడు కలవలేదు. ఇక, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారు. అయితే, పూర్తిగా ఇది సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే జరుగుతున్న సమావేశంగా మంత్రులు చెబుతున్నారు. కానీ, ఈ సమావేశం మీద రాజకీయంగా..అదే విధంగా సినీ ఇండస్ట్రీ లోనూ పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది.

English summary
YSRCP leader Chevireddy Bhaskara Reddy denied postings on chiranjeevi by his fans name. He says that he does not have twitter account, He asked police to remove thost postings which cirvulating by his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X