విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ విచారణకు వైసీపీ నేత పీవీపీ డుమ్మా.. సీఎం జగన్ సరికొత్త ఎత్తుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

వైసీపీ కీలక నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలు తప్పని తేలింది. తన ఇంటి ఎదురుగా ఉంటే ఓ విల్లా యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై బంజారా హిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో బుధవారం మధ్యాహ్నం పీవీపీ సహా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత అరెస్టు వార్తలు వచ్చినా.. నోటీసులు మాత్రమే జారీ అయ్యాయని ఆలస్యంగా వెల్లడైంది. తొలి రోజు సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న ఆయన.. రెండో రోజు విచారణ కోసం ఠాణాకు రాకపోవడం చర్చనీయాంశమైంది. శుక్రవారం తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చివరికి భూటాన్ కూడా భారత్‌కు షాకిచ్చింది.. నదీజలాల నిలిపివేత.. అస్సాం రైతుల ఆందోళన.. అన్నిదిక్కులా..చివరికి భూటాన్ కూడా భారత్‌కు షాకిచ్చింది.. నదీజలాల నిలిపివేత.. అస్సాం రైతుల ఆందోళన.. అన్నిదిక్కులా..

ఇదీ వివాదం..

ఇదీ వివాదం..

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ షాట్స్ లో ఒకరిగా, వైసీపీలో ముఖ్యనేతగా కొనసాగుతోన్న పీవీపీని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 14లో పీవీపీ ఇంటి ఎదురుగా ఉన్న విల్లా యజమాని విక్రమ్ కైలాశ్.. రూఫ్ టాప్ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోడాన్ని పీవీపీ తప్పు పట్టడం, ఆ క్రమంలో వైసీపీ నేత తన మనుషులతో కలిసి ఆ విల్లాలోకి వెళ్లి గలాటా సృష్టించడంతో కేసు నమోదైంది. సీఆర్పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు అందుకున్న పీవీపీ రెండోరోజైన గురువారం విచారణకు డుమ్మా కొట్టారని, ఆయన ఇంట్లోనే ఉన్నారని గుర్తించిన పోలీసులు.. అక్కడ సిబ్బందిని మోహరించారని వెల్లడైంది.

డుమ్మా కొట్టి పెట్టిందే ఆ ట్వీట్..

డుమ్మా కొట్టి పెట్టిందే ఆ ట్వీట్..

‘‘ఆయన ఇల్లు మా విల్లా వెనకాలే ఉంటుంది. కొద్ది నెలలుగా మాపై బెదిరింపులకు పాల్పడుతోన్న పీవీపీ.. మేము రూఫ్ గార్డెన్ కడితే తన ఇల్లు కనిపించదనే సాకుతో అనుచరులతో వచ్చి దాడికి, రూఫ్ గార్డెన్ కూల్చివేతకు యత్నించారు''అంటూ బాధితుడు కైలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 452, 427, 504, 506, 147, రెడ్ విత్ 149 కింద పీవీపీ మీద బంజారాహిల్స పోలీసులు కేసులు న‌మోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10.30 వరకు విచారించిన పోలీసులు.. రెండో రోజు కూడా రావాలని ఆదేశించారు. కానీ గురువారం పోలీసు విచారణకు హాజరు కాకుండా పీవీపీ చేసిన ఓ ట్వీట్ సంచనలం రేపింది. ‘‘తప్పును తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న'' అంటూ విల్లా వివాదంపై నర్మగ్భవ్యాఖ్యలు చేశారు.

రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?

జగన్ ఎత్తుగడలకు ప్రశంసలు..

జగన్ ఎత్తుగడలకు ప్రశంసలు..

ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోన్న తరుణంలో.. అగ్రదేశాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తోన్న విధానాలు, అమలు చేస్తోన్న ఎత్తుగడలు అద్భుతంగా ఉన్నాయంటూ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆంగ్రూ ప్లెమింగ్ ప్రశంసించారు. ఏపీలో కొవిడ్-19 కట్టడికి సర్కారు అవలంభిస్తోన్న పద్ధతులపై ప్రముఖ మీడియాలో వచ్చిన విశ్లేషణను షేర్ చేసిన ఫ్లెమింగ్.. ‘‘ఏపీ సీఎంను చూసి ఆసియా-ఆస్ట్రేలియా దేశాలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిఉంది''అని వ్యాఖ్యానించారు. ఫ్లెమింగ్ కామెంట్లపై పీవీపీ ఆసక్తికర రిప్లై ఇచ్చారు.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu
ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలో..

ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలో..

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం.. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 14,049 మందికి టెస్టులు చేస్తుండటం రికార్డుకాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లు, 11,158 మంది గ్రామ సచివాలయ సిబ్బంది సేవల్ని అద్భుతంగా మలిచారంటూ ఫ్లెమింగ్ గుర్తుచేయగా.. ఏపీ సీఎం విధానాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలంటూ పీవీపీ రిప్లై ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ఏపీలో ప్రతి 50 మందిని మ్యాపింగ్ చేస్తూ, కరోనాకు అడ్డుకట్ట వేస్తున్న విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోనే అమలవుతున్నదని వైసీపీ నేత పేర్కొన్నారు.

English summary
It is heard that ysrcp leader and film producer pvp did not attend second day enquiry before police in banjara hills villa dispute. he also thanked UK Deputy High Commissioner Fleming for praising ap cm YS Jagan over COVID-19 tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X