వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్కింగ్ విమెన్‌ కు పీరియడ్ లీవ్ ఇవ్వరూ - సీఎం జగన్‌ కు పీవీపీ ట్వీట్ రిక్వెస్ట్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో పలు ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు ట్వీట్లు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న వైసీపీ నేత ప్రసాద్ వి పొట్లూరి తాజాగా మహిళలకు సంబంధించిన ఓ సమస్య పైన ట్వీట్ చేశారు. అదీ వర్కింగ్ వుమెన్ ఎదుర్కొంటున్న సమస్యపైన. పనిచేసే మహిళలు పీరియడ్ సమయంలో పడే ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం వీరిపై దృష్టి సారించాల్సిన విషయాన్ని సీఎం జగన్‌కు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది.

సాధారణంగా పనిచేసే మహిళలకు నెల నెలా పిరియడ్ ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం కానీ ప్రైవేటు సంస్ధలు కానీ వీరికి ఆ సమయంలో ప్ర్తత్యేకంగా ఎలాంటి సెలవు ఇవ్వడం లేదు. కానీ మారుతున్న కాలంలో చాలా రాష్ట్రాల్లో తాజాగా ఈ డిమాండ్ పెరుగుతోంది. పనిచేసే మహిళలకు నెలలో కనీసం ఒక్క రోజైనా పిరియడ్ లీవ్ కేటాయించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ మన దేశంలో బీహార్ ప్రభుత్వం మాత్రమే దీన్ని అమలు చేస్తోంది. అలాగే తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తమ ఉద్యోగులకు దీన్ని వర్తింప చేసింది.

ysrcp leader pvp request cm jagan to give period leave to working women in ap

పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న పీరియడ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపాలని వైసీపీ నేత పీవీపీ తాజాగా ట్వీట్ చేశారు. "మాట్లాడకుండా గుట్టుగా ఉంచుతూ బాధపడే రోజులు కాదు. జొమాటో సంస్థ సంవత్సరానికి పది రోజులు ఆడవారికి పీరియడ్ లీవ్ ప్రకటించి, వారు పడే ఇబ్బందుల నుంచి సహకారమందించిది. బీహార్ ప్రభుత్వం నెలకు రెండు రోజులు సెలవు ఇచ్చింది." సీఎం జగన్ మన రాష్ట్రంలో పనిచేసే మహిళల గురించి మీరు కూడా ఆలోచించరూ అంటూ పీవీపీ తన ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

Recommended Video

Andhra Pradesh New Industrial Policy 2020-23 | Oneindia Telugu
ysrcp leader pvp request cm jagan to give period leave to working women in ap
English summary
ysrcp leader potluri veera prasad request chief minister ys jagan to give period leave to working women in the state. he mentioned zomato and bihar government's initiative in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X